ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి.. ఈ మాట అంటారని ఎవరూ ఊహించి ఉండరు..!

ABN, First Publish Date - 2023-05-10T18:37:09+05:30

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో (Karnataka Politics) ప్రభుత్వాలనే మార్చిన ఘనత ఆయనది. వ్యూహాత్మక రాజకీయాలకు పేరొందిన గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy) ఈసారి ఎన్నికల్లో కూడా తన సత్తా ఏంటో చూపాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో (Karnataka Politics) ప్రభుత్వాలనే మార్చిన ఘనత ఆయనది. వ్యూహాత్మక రాజకీయాలకు పేరొందిన గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhana Reddy) ఈసారి ఎన్నికల్లో కూడా తన సత్తా ఏంటో చూపాలని వేగంగా పావులు కదిపారు. గెలుపే ధ్యేయంగా ఎత్తులు వేశారు. రాష్ట్రంలో ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీ (KRPP) స్థాపించినా ప్రత్యేకంగా కల్యాణ కర్ణాటకలోనే పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి నిలిపారు. పార్టీ వ్యవస్థాపకులు గాలి జనార్ధన్ రెడ్డి గంగావతిలో, ఆయన భార్య గాలి లక్ష్మీ అరుణ బళ్లారి నగరం (Ballari) నుంచి పోటీ చేశారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా గాలి జనార్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫలితాలు వెల్లడయ్యాక ఒకవేళ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే.. కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు కోరితే.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటే కచ్చితంగా సిద్ధరామయ్యకు సపోర్ట్ చేస్తా’’ అని గాలి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఈ బీజేపీ మాజీ మంత్రి చేసిన ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు.. 2012లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో గాలి జనార్ధన రెడ్డికి, సిద్ధరామయ్యకు మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. ఆ సందర్భంలో గాలి ఆగ్రహంతో ఊగిపోతూ.. సభ సాక్షిగా దమ్ముంటే బళ్లారికి వచ్చి కాంగ్రెస్ సభ నిర్వహించాలని సిద్ధరామయ్యకు గాలి సవాల్ విసిరారు. గాలి సవాల్‌ను స్వీకరించిన సిద్ధూ ఆ సందర్భంలో బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర కూడా చేశారు. బళ్లారిలో కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి సభను నిర్వహించి విజయవంతం చేశారు. 2013లో కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణమయిన పరిణామాల్లో ఇది ఒకటి. అంత రాజకీయ వైరం ఉన్న సిద్ధరామయ్యకు మద్దతు తెలుపుతానని గాలి జనార్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత విలేకరులతో చెప్పడం కర్ణాటక రాజకీయ వర్గాలను కొంత విస్మయానికి గురిచేసింది.

బళ్లారిలో అడుగుపెట్టకుండా సీబీఐ ఆంక్షలు విధించడంతో గంగావతి నుంచే ‘గాలి’ వ్యూహాలు అమలు చేశారు. బళ్లారిలో గాలి అరుణ వార్డుల్లో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేశారు. ఆమె వెంట గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన ఎం.అలీఖాన్ రాముడికి హనుమంతుడిలా పనిచేశారు. ముఖ్యంగా ముస్లింలు, బీసీలు, లింగాయత్, బలిజ, కమ్మ ఇలా అన్ని వర్గాలతో ప్రత్యేకంగా కలుస్తూ కేఆర్‌పీపీకి పలువురు నేతలను తిప్పడంలో అలీఖాన్ సఫలీకృతుడయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ఓటర్లలో వ్యతిరేకులను తమ వైపు తిప్పుకున్నారు.

గాలి జనార్ధన్ రెడ్డి మామ పరమేశ్వరరెడ్డి, కూతురు బ్రాహ్మణి, పొద్దుటూరు సబ్బారెడ్డి ఇలా అనేక మంది తెర వెనుక ఉండి గాలి జనార్ధన్ రెడ్డి భార్య లక్ష్మి అరుణ గెలుపునకు బళ్లారిలో విస్తృతంగా పనిచేశారు. గాలి అరుణ కూడా మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. తన భర్త జనార్ధన్ రెడ్డి బళ్లారిని అభివృద్ధి చేసిన తీరును వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూతురు బ్రాహ్మణి కూడా తల్లికి తోడుగా ప్రచారం చేసి తనదైన ముద్ర వేసింది. ‘నాన్న ఉంటే మేము రోడ్డుకు వచ్చేవాళ్లమే కాదు. నాన్న మాకు దూరంగా ఉన్నాడు. మీరే మాకు అన్న,అక్క, అమ్మనాన్నా’ అంటూ ఓటర్లను భావోద్వేగ ప్రసంగాలతో గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగా చేయడం విశేషం. ఇక అలీఖాన్ అసమ్మతి నేతలను కలిసి వ్యూహాలు రచించారు. రాష్ట్రంలో 15 స్థానాల్లో పార్టీ తరపున అభ్యర్థులను గాలి జనార్ధన్ రెడ్డి బరిలో నిలిపినా.. బళ్లారి సిటీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ, కొప్పళ జిల్లా గంగావతిలో గాలి జనార్ధన్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ ‘కేఆర్‌పీపీ’ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తెలియాలంటే మే 13 వరకూ వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-05-10T18:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising