ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Diabetes: మీకు షుగర్ ఉందా? అయితే ఈ 6 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లొద్దు..!

ABN, First Publish Date - 2023-11-26T18:47:04+05:30

గతంలో షుగర్ వ్యాధి అనేది ధనవంతులకు మాత్రమే వచ్చే జబ్బు అనుకునేవారు. ఆ తర్వాత వయసు మీరిన తర్వాత చాలా మందికి ఈ వ్యాధి వస్తుందనేవారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ మధుమేహం పీడిస్తోంది.

గతంలో షుగర్ వ్యాధి (Diabetes) అనేది ధనవంతులకు మాత్రమే వచ్చే జబ్బు అనుకునేవారు. ఆ తర్వాత వయసు మీరిన తర్వాత చాలా మందికి ఈ వ్యాధి వస్తుందనేవారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ మధుమేహం పీడిస్తోంది. జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం (Exercise) లేకపోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి మధుమేహం రావడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు (Food and Health).

కారణమేదైతేనేం ఒక్కసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం దానిని మోయాల్సిందే. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితం గడపాల్సిందే. మీరు కనుక డయాబెటిక్ పేషెంట్స్ అయితే కొన్ని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అవేంటో ఒకసారి చూద్దాం (Diet to dibetic patients)..


రిఫైండ్ కార్బోహైడ్రేట్లు (Refined Carbs)

ప్రాసెస్ చేసి, నిలవ ఉంచిన కార్బోహైడ్రేట్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఇవి శరీరంలోకి వెళ్లిన వెంటనే జీర్ణం అయిపోయి గ్లూకోజ్‌గా మారిపోతాయి. అంతేకాదు వీటి తిన్న కొద్ది సేపటికే మళ్లీ ఆకలి వేయడం మొదలవుతుంది. బిస్కెట్లు, నూనెలో వేయించిన పదార్థాలు, వైట్ బ్రెడ్, చాక్లెట్లు, పిజ్జా, తెల్ల అన్నం, కేక్‌లు, పేస్ట్రీలు మొదలైనవన్నీ మధుమేహులకు చాలా అనర్థాలు కలిగిస్తాయి.


తీపి పదార్థాలు (Sugars)

పంచదారతో చేసిన అన్ని పదార్థాలకూ షుగర్ వ్యాధి గ్రస్తులు కచ్చితంగా దూరంగా ఉండాలి. కనీస స్థాయిలో కూడా పోషక విలువలు ఉండని ఈ స్వీట్లు శరీరంలోని బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను అమాంతంగా పెంచేస్తాయి. మధుమేహం వల్ల వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యలకూ ఇవే కారణమవుతాయి.


శాచురేటెడ్ ఫ్యాట్స్ (Saturated Fats)

సంతృప్త కొవ్వులు శరీరంలోని చెడు కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అలాగే మంచి కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల గుండెపోట్లు, పక్షవాతం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, వెన్న, బేక్ చేసిన పదార్థాలు, నూడుల్స్, అన్ని రకాల జంక్‌ఫుడ్‌లోనూ ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అధిక మొతాదులో ఉంటాయి.


ఆల్కహాల్ (Alcohol)

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరంలోని లివర్ సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా గ్లూకోజ్ లెవెల్స్ అసాధారణంగా మారుతుంటాయి. అంతేకాదు షుగర్ కోసం తీసుకునే మందుల పనితీరును కూడా ఆల్కహాలు ప్రభావితం చేస్తుంది.


ప్రాసెస్ చేసిన మాంసం (Processed Meat)

అధిక శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే మాంసానికి కొన్ని రకాల రసాయనాలు కలిపి నిలవ ఉంచుతారు. ఇవి కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతాయి. అలాగే అనేక గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. ప్రాసెస్డ్ మీట్ కంటే ఫ్రెష్ మీట్ ఎంతో ఉత్తమం.


ఉప్పు (Salt)

ఉప్పు అధికంగా వేసి వేయించి, నిలవ చేసిన పదార్థాలు రక్తపోటును విపరీతంగా పెంచుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గ్లూకోజ్ ఎక్కువ విడుదలయ్యేలా కూడా ప్రేరేపిస్తాయి. అన్ని రకాల సాల్టెడ్ స్నాక్స్‌కు దూరంగా ఉండడం మంచిది.

Updated Date - 2023-11-26T18:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising