ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండె సమస్యలు ఉన్నవారు ఈ గింజలు తింటే..!

ABN, First Publish Date - 2023-05-13T16:08:48+05:30

తోటకూర గింజలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో ఫైబర్‌, ప్రొటీన్‌, మాంగనీసు, మెగ్నీషియం లాంటి ఎన్నో కీలకమైన

seeds
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటకూర గింజలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో ఫైబర్‌, ప్రొటీన్‌, మాంగనీసు, మెగ్నీషియం లాంటి ఎన్నో కీలకమైన పోషకాలున్నాయి కాబట్టే ఈ ప్రాచీన గింజలను మన దేశంలో రామ్‌దానా (గ్రెయిన్‌ ఆఫ్‌ గాడ్‌) అనీ, రాజ్‌గిరా (గ్రెయిన్‌ ఆఫ్‌ కింగ్స్‌) అనీ పిలుస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన గింజల్లోని పోషకాల గురించి తెలుసుకుందాం!

గుండెకు మేలు: వీటిలోని ఫైటోస్టెరాల్స్‌ మూలంగా అమరాంథ్‌ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కార్డియో వ్యాస్క్యులర్‌ వ్యాధులున్న వాళ్లు వీటిని తప్పక తినాలి.

ఇన్‌ఫ్లమేషన్‌: ఈ గింజలు జీర్ణమయ్యే క్రమంలో విడుదలయ్యే పెప్టైడ్స్‌తో శరీరం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావానికి లోనవుతుంది. అలాగే ఈ గింజల్లోని బయో యాక్టివ్‌ పెప్టైడ్‌ అయిన లునాసిన్‌ కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.

ప్రొటీన్‌: వృక్షాధార మాంసకృత్తుల మీద ఆధారపడిన వాళ్లకు అమరాంథ్‌ చక్కని ప్రొటీన్‌ ప్రత్యామ్నాయం. 100 గ్రాముల గింజల్లో 13.27 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. పైగా దీన్లో సెపోనిన్‌ పరిమాణం తక్కువ కాబట్టి ఈ గింజలను నానబెట్టి వండుకోవలసిన అవసరం లేదు. పైగా పేగుల ఆరోగ్యానికి కూడా ఈ గింజలు మేలు చేస్తాయి.

ఫైబర్‌: ఈ గింజలు పేగుల మీద ప్రిబయోటిక్‌ ప్రభావాన్ని కనబరుస్తాయి. ఫలితంగా పేగుల ఆరోగ్యానికి తోడ్పడే షార్ట్‌ చెయిన్‌ ఫ్యాటీ యాసిడ్ల సింథసిస్‌ పెరుగుతుంది.

మైక్రో న్యూట్రియంట్లు: క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌ లాంటి ఖనిజ లవణాలు కూడా ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ బి6, ఫోలేట్‌ లాంటి విటమిన్లకూ వీటిలో కొదవ ఉండదు.

వంటకాలు ఇలా: ఈ గింజల పిండితో రోటీలు చేసుకోవచ్చు. దోసెలు పోసుకోవచ్చు. సిరీల్‌గా తినవచ్చు. కట్‌లెట్స్‌, పోరిడ్జ్‌ చేసుకోవచ్చు. పిజ్జా బేస్‌గా కూడా వాడుకోవచ్చు.

Updated Date - 2023-05-13T16:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising