ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayurvedic tips: శీతాకాలం సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు!

ABN, First Publish Date - 2023-11-21T12:42:58+05:30

చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని చిన్నపాటి సమస్యలు సమసిపోకుండా వేధిస్తూనే ఉంటాయి. వాటిని ఆయుర్వేద చిట్కాలతో అదుపుచేసే వీలుంది. అదెలాగంటే.....

చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని చిన్నపాటి సమస్యలు సమసిపోకుండా వేధిస్తూనే ఉంటాయి. వాటిని ఆయుర్వేద చిట్కాలతో అదుపుచేసే వీలుంది. అదెలాగంటే.....

పొడిచర్మం: పెరుగు, మజ్జిగ కలిపి చర్మానికి పూసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కలబంద గుజ్జుకు చెంచా కాకరకాయ రసం చేర్చి, కలిపి ముఖానికి పూసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. పొద్దునే కడిగేసుకోవాలి.

పొడి జుట్టు: గుడ్డు పచ్చసొన, ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. నీళ్లల శీకాకాయ, బ్రహ్మి కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేసి, వెంట్రుకలు మాస్క్‌ వేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

పాదాల పగుళ్లు: అరటిపండు గుజ్జును పగుళ్లకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. రాత్రి పడుకునేముందు పాదాలకు వంటనూనె పట్టించి, సాక్స్‌ వేసుకోవాలి.

దగ్గు, జలుబు: నీళ్లలో జింజర్‌ రూట్‌ నానబెట్టి తాగాలి. ఆహారంలో అల్లం ఎక్కువగా వాడాలి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గడం కోసం పాలలో పసుపు కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.

కాళ్లవాపు: గ్లాసు నీళ్లలో ధనియాలు కలిపి నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించాలి. ఇలా వాపు తగ్గేవరకూ ఆ నీళ్లను ప్రతిరోజూ తాగుతూ ఉండాలి. కాళ్లను నువ్వుల నూనెతో మర్దన చేస్తూ ఉండాలి.

Updated Date - 2023-11-21T12:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising