Cool drinks: కూల్‌డ్రింక్ తాగేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా!
ABN, First Publish Date - 2023-06-20T14:57:51+05:30
చలచల్లని కూల్‌డ్రింక్ గొంతులో నుంచి జారుతూ ఉంటే, ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపిస్తుంది. నిజమే! కానీ ఆ కూల్‌డ్రింకే ప్రాణాలను తీసే
చలచల్లని కూల్‌డ్రింక్ గొంతులో నుంచి జారుతూ ఉంటే, ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపిస్తుంది. నిజమే! కానీ ఆ కూల్‌డ్రింకే ప్రాణాలను తీసే రసాయనాలను కూడా కలిగి ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కూల్ డ్రింక్ తాగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం!
మొదటి 10 నిమిషాలు: నాలుగు టీస్పూన్ల చక్కెర శరీరంలోకి చేరుకుంటుంది. ఈ అధిక చక్కెరతో వాంతి అయిపోకుండా కూల్‌డ్రింక్ తయారీలో ఫాస్ఫారిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తారు.
తర్వాతి 20 నిమిషాలు: రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ఇన్సులిన్ ఉధృతి పెరుగుతుంది. ఈ అధిక చక్కెరలను కాలేయం కొవ్వుగా మారుస్తుంది.
తర్వాతి 40 నిమిషాలు: కూల్‌డ్రింక్‌లోని కెఫీన్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. కాలేయంలోని కొవ్వును వదిలించడం కోసం, మెదడులోని అడినోసిన్ రిసెప్టార్లు బ్లాక్ అవుతాయి.
తర్వాతి 45 నిమిషాలు: చిన్న పేగుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌లను ఫాస్ఫారిక్ యాసిడ్ బైండ్ చేస్తుంది. చక్కెరతో శరీరంలోని క్యాల్షియం బయటకు వెళ్లిపోతుంది.
60 నిమిషాలు: కెఫీన్ డయూరిటిక్‌గా పని చేస్తుంది. దాంతో మూత్రం ద్వారా క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఎలకొ్ట్రలైట్లు బయటకు వెళ్లిపోతాయి.
ఆ తర్వాత: షుగర్ క్రాష్ వల్ల చీకాకు, నిస్సత్తువలు వేధిస్తాయి. మూత్రంలో ఇతర న్యూట్రియంట్లను కూడా కోల్పోతాం కాబట్టి త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతాం.
Updated Date - 2023-06-20T14:57:51+05:30 IST