Hot water bath: ఆ సమస్య ఉన్న వారు వేడి నీళ్ల స్నానం చేయకూడదు
ABN, First Publish Date - 2023-08-24T11:55:58+05:30
మన శరీరానికి అవసరమైన ద్రవాలను తగినంత తీసుకోకపోతే రకరకాల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం..
మన శరీరానికి అవసరమైన ద్రవాలను తగినంత తీసుకోకపోతే రకరకాల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం..
చర్మం పొడిబారుతుంది. ముడతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం కాంతివంతంగా ఉండదు. పాలిపోయినట్లు కనిపిస్తుంది. చిన్న చిన్న గాయాలకు ఎక్కువగా రక్తం వస్తూ ఉంటుంది. దురదగా ఉంటుంది.
పెదాలు పగిలిపోతాయి. పాలిపోతాయి. పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పగుళ్లు కూడా త్వరగా మానవు. అప్పుడప్పుడు రక్తం వస్తూ ఉంటుంది.
ఎలా రక్షించుకోవాలి?
ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. పనుల్లో బాగా బిజీగా ఉండేవారు- రిమైండర్స్ పెట్టుకోవటం మంచిది.
నీటి శాతం ఎక్కువగా ఉన్న పళ్లను, కూరగాయాలను తినాలి. ఇదే విధంగా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే అవకాడోలు, రకరకాల డ్రైఫ్రూట్స్‌ను తినాలి.
హైలూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్ ఎక్కువగా ఉన్న చర్మ సౌందర్య సాధనాలను వాడితే తేమ ఎక్కువ సేపు ఉంటుంది. పెదాలకు కొబ్బరినూనె లేదా నెయ్యి రాయాలి.
వేడినీళ్లుతో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు. రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బులను వాడకూడదు.
ఎండలో ఎక్కువ సేపు తిరగకూడదు. ఒక వేళ ఎండలోకి వెళ్లాల్సి వస్తే- వేడి తగలకుండా బట్టలు వేసుకు వెళ్లాలి.
కాఫీ, ఆల్కాహాల్ ఎక్కువగా తాగకూడదు. ఒక వేళ ఈ అలవాటు ఉంటే- అవసరమైనదాని కన్నా ఎక్కువ నీటిని తాగాలి.
Updated Date - 2023-08-24T11:55:58+05:30 IST