Healthy Hair: ఆరోగ్యకర జుట్టు కోసం ఇలా చేయండి
ABN, First Publish Date - 2023-07-22T11:38:48+05:30
అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.
బౌల్‌లో రెండు టీస్పూన్ల వేపపొడి, రెండు టీస్పూన్ల శనగపిండి వేసి అందులో కొద్దిగా పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టులో మెరుపు వస్తుంది.
ఆవాలనూనె టీస్పూన్, టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిముషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
ఉసిరిపొడిని కొబ్బరి నూనెతో కలిపిన మిశ్రమాన్ని పట్టిస్తే తలలో రక్తం సరఫరా బాగా జరుగుతుంది. దీని వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.
మీ దగ్గర ఎలాంటి హెయిర్ ఇంగ్రిడియంట్స్ లేకుంటే కప్పులో నిమ్మరసం తీసుకుని జుట్టు అంతా పట్టించాలి. ఇలా చేస్తే కాస్త మంట వచ్చినట్లు అనిపిస్తుంది. సిట్రిక్ యాసిడ్ కాబట్టి మంచిదే. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దీంతో పాటు జుట్టు రాలిపోవటం ఆగిపోతుంది.
ఉసిరి రసం, కొబ్బరి నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కలపాలి. దీన్ని పట్టించిన అరగంటకు జుట్టును మైల్డ్ షాంపూతో కడిగేయాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
పుదీనా పేస్ట్ తలకు పట్టిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.
Updated Date - 2023-07-22T11:38:48+05:30 IST