ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ తాగితే బరువు తగ్గుతారా? దీంట్లో నిజమెంత?

ABN, First Publish Date - 2023-06-08T13:06:04+05:30

బరువు తగ్గడానికి టీ తోడ్పడుతుందా, తోడ్పడదా? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. కానీ నిజానికి టీ తాగడంలో తెలివిని ప్రదర్శించకపోతే

tea
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు తగ్గడానికి టీ తోడ్పడుతుందా, తోడ్పడదా? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. కానీ నిజానికి టీ తాగడంలో తెలివిని ప్రదర్శించకపోతే బరువు తగ్గే ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బరువు పెరిగే వీల్లేకుండా టీని ఎలా ఆస్వాదించాలంటే....

పాలతో చిక్కే: పేగులు శోషించుకునే కొవ్వుచ కొలెస్ట్రాల్‌ పరిమాణాలను తగ్గించడానికి టీ తోడ్పడుతుంది. అయితే పాలలోని ప్రొటీన్లు టీ కలిగి ఉండే కొవ్వును శోషించుకునే గుణాలను హరిస్తాయి. కాబట్టి టీ తాగాలనిపిస్తే, పాలు జోడించకూడదు.

చక్కెర: వెయిట్‌లాస్‌కు చక్కెర పెద్ద అవరోధమనే విషయం అందరికీ తెలిసిందే! రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల టీని చక్కెరతో కలిపి తాగితే, ఒక పూర్తి భోజనంతో సమానమైన క్యాలరీలు శరీరంలోకి చేరతాయి.

స్నాక్స్‌: టీతో పాటు బిస్కెట్లు లాంటివి తింటూ ఉంటాం. మరీ ముఖ్యంగా సాల్టెడ్‌ స్నాక్స్‌ మరింత ప్రమాదకరం.

ఇలా తాగాలి

● అతి తక్కువ పాలతో, చక్కెర కలుపుకోకుండా అల్లం, దాల్చిన చెక్క, యాలకుల పొడి లాంటి వాటిని జోడించి టీ తాగవచ్చు.

● ఉప్పుతో కూడిన స్నాక్స్‌కు బదులుగా, బాదం, వాల్‌నట్స్‌ లాంటి వాటిని తినవచ్చు.

● టీ అసిడిటీని పెంచుతుంది కాబట్టి పరిమితంగా తాగాలి.

● నిద్రకు ముందు తాగితే నిద్రలేమి వేధిస్తుంది.

● పాలలో ఎక్కువ సమయం పాటు టీ పొడిని ఉడికిస్తే, శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది.

Updated Date - 2023-06-08T13:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising