ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Egg: మృదువైన చర్మానికి ‘గుడ్డు’ సాయం

ABN, First Publish Date - 2023-09-18T11:19:10+05:30

కోడిగుడ్డు పౌష్టికాహారం ఇవ్వటమే కాదు.. మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్లు, మినరల్స్‌, పొట్రీన్లు చర్మపోషణకు, జుట్టు నిగనిగలాడటానికి ఉపకరిస్తాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.

కోడిగుడ్డు పౌష్టికాహారం ఇవ్వటమే కాదు.. మన చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్లు, మినరల్స్‌, పొట్రీన్లు చర్మపోషణకు, జుట్టు నిగనిగలాడటానికి ఉపకరిస్తాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం.

పొడి చర్మానికి...

ఒక గుడ్డులో పచ్చసొనను ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో కలపాలి. దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా ఒక వారం రోజులు చేస్తే పొడిచర్మం మృదువుగా అవుతుంది.

మూడు టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లేక్స్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ పచ్చసొన.. ఒక టేబుల్‌ స్పూన్‌ పాలు.. ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగివేయాలి.

నూనోడే చర్మానికి...

ఒక గుడ్డులోని తెల్లసొనను టేబుల్‌ స్పూన్‌ తేనెలో కలపాలి. దీనిని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా ఒక వారం రోజుల చేస్తే చర్మంపై అదనంగా ఉన్న నూనె పోతుంది.

3 టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌లో టేబుల్‌ స్పూన్‌ తెల్లసొన, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. దీనిని మొఖానికి పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా అవుతుంది.

చర్మంపై రంధ్రాలు పూడుకుపోతే...

తెల్లసొనను ఓట్స్‌తో కలిపి మొఖానికి పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత- గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే రంధ్రాలన్నీ మళ్లీ తెరుచుకుంటాయి.

నూనోడే జుట్టుకు...

తెల్ల సొనను జుట్టుకు పట్టించాలి. అది ఆరేలోపులో పెద్ద కప్పు నీటిలో నిమ్మకాయరసాన్ని కలపాలి. 20 నిమిషాల తర్వాత నిమ్మకాయ నీటితో జుట్టును కడగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

పొడిబారిన జుట్టుకు...

రెండు టేబుల్‌ స్పూన్ల ఆల్మండ్‌ నూనెలో ఒక గుడ్డు పచ్చసొనను కలపాలి. దీనిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిగనిగలాడాలంటే...

తెల్లసొనలో తగినంత నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు పట్టించి అరగంట ఉంచాలి. ఆ తర్వాత షాంపుతో కడిగివేయాలి.

టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ ఆల్మండ్‌ ఆయిల్‌, టేబుల్‌ స్పూన్‌ పెరుగులో తెల్లసొనను వేసి బాగా కలపాలి. దీనిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.

Updated Date - 2023-09-18T11:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising