Curd: పెరుగు ఎందుకు తినాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
ABN, First Publish Date - 2023-09-07T12:41:18+05:30
కొందరు పెరుగును తమ ఆహారంలో ఒక భాగంగా పరిగణించరు. తప్పనిసరైతే తప్ప తినరు. కానీ పెరుగు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం..
కొందరు పెరుగును తమ ఆహారంలో ఒక భాగంగా పరిగణించరు. తప్పనిసరైతే తప్ప తినరు. కానీ పెరుగు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం..
పెరుగులో మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోని యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత పెరుగు తినమంటారు. లేదా మజ్జిగ తాగమంటారు.
కొందరికి కడుపునెప్పి తరచు వస్తూ ఉంటుంది. విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి. దీనికి బిలోఫిలియా అనే బ్యాక్టీరియా కారణం. ఈ బ్యాక్టీరియాను ఎదుర్కోవటంలో పెరుగు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పెరుగులో కాల్షియం, ఫాస్పరి్‌సలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
పెరుగులో కొవ్వు ఎక్కువ ఉంటుందని.. దీని వల్ల గుండెకు ఇబ్బంది కలుగుతుందని కొందరు భావిస్తారు. కానీ పెరుగు మంచి కొలస్ట్రాల్‌ను పెంపొందించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
పెరుగులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని తింటే శరీరంలో బ్లడ్ సుగర్ విలువలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు.
Updated Date - 2023-09-09T01:19:20+05:30 IST