ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Make Up: ఐ షాడోతో కళ్ల ఆకారాన్ని మార్చేయొచ్చు.. ఎలాగంటే..!

ABN, First Publish Date - 2023-08-12T11:51:38+05:30

ఐ షాడోతో కళ్ల ఆకారాన్ని మార్చేయవచ్చు. చిన్న కళ్లను పెద్దవిగా కనిపించేలా చేయవచ్చు. జీవం కోల్పోయిన కళ్లను కాంతివంతంగా మార్చేసుకోవచ్చు. అయితే అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి.

ఐ షాడోతో కళ్ల ఆకారాన్ని మార్చేయవచ్చు. చిన్న కళ్లను పెద్దవిగా కనిపించేలా చేయవచ్చు. జీవం కోల్పోయిన కళ్లను కాంతివంతంగా మార్చేసుకోవచ్చు. అయితే అందుకోసం కొన్ని చిట్కాలను పాటించాలి.

ప్యాలెట్‌ సెలెక్షన్‌

ముదురు నుంచి లేత రంగుల వరకూ రకరకాల రంగుల ఐ షాడోలతో కూడిన ప్యాలెట్‌ను ఎంచుకోవాలి. దాన్లో మరీ ముఖ్యంగా మీకు మరింత బాగా నప్పే రంగులు ఉండేలా చూసుకోవాలి.

భిన్నమైన భాగాలు

కనురెప్పల టర్మినాలజీ పట్ల కూడా అవగాహన ఏర్పరుచుకోవడం అవసరమే! పై కనురెప్పల పైభాగాన్ని ల్యాష్‌ లైన్‌ అంటారు. కనుబొమల చివరి ప్రదేశాన్ని బ్రో బోన్‌ అంటారు. కను రెప్పల కొనలను క్రీజ్‌ లైన్‌ అంటారు. కింది కనురెప్పను లోయర్‌ ల్యాష్‌లైన్‌ అంటారు. ముక్కు దగ్గరి భాగాన్ని ఇన్నర్‌ కార్నర్‌ అంటారు.

రేంజ్‌ ఆఫ్‌ కలర్స్‌

ప్యాలెట్‌ను తెరిచి, ఏవి తేలిక రంగులు, ఏవి మధ్యస్థ రంగులు, ఏవి ముదురు రంగులో గుర్తించాలి. వీటిలో ఏ రంగులను ఉపయోగిస్తే, ఉబ్బెత్తుగా కనిపించేలా చేయవచ్చో, ఏ రంగులను ఉపయోగిస్తే, లోతుగా కనిపించేలా చేయవచ్చో తెలుసుకోవాలి.

అప్లికేషన్‌ ఇలా...

  • తేలిక రంగులను హైలైట్‌ కోసం ఉపయోగించాలి. ఇన్నర్‌ కార్నర్‌, బో బ్రోన్‌ ప్రదేశాల్లో ఈ రంగులను వాడుకోవాలి.

  • మీడియం రంగులను కంటి ప్రాధమిక ఆకారాన్ని డిఫైన్‌ చేయడం కోసం వాడుకోవాలి. అలాగే తేలికపాటి ప్రదేశాలను ముదురు రంగు ప్రదేశాల్లోకి బ్లెండ్‌ చేయడానికి కూడా ఈ రంగులు ఉపయోగపడతాయి. ఈ రంగులను కనురెప్పల మధ్యలో, క్రీజ్‌ల దగ్గర వాడుకోవాలి.

  • కంటికి డెప్త్‌ తీసుకురావడం కోసం, కాంటూరింగ్‌ కోసం ముదురు రంగులు ఉపయోగపడతాయి. కంటికి మరింత ఇంటెన్సిటీని చేకూర్చడం కోసం కూడా ముదురు ఐ షాడోలను వాడుకోవచ్చు. కనురెప్పల చివర్లలో, క్రీజ్‌ల దగ్గర ఈ రంగులను అప్లై చేసుకోవాలి.

బ్లెండింగ్‌: ముదురు రంగును లేత రంగులోకి బ్లెండ్‌ చేయాలన్నా, లేత రంగును ముదురు రంగులోకి బ్లెండ్‌ చేయాలన్నా బ్లెండింగ్‌ బ్రష్‌ను వృత్తాకారంలో కదిలిస్తూ బ్లెండ్‌ చేసుకోవాలి.

కంటి మేకప్‌ కోసం

  • ప్రైమర్‌, కన్‌సీలర్‌, ఫౌండేషన్‌ (అవసరం మేరకు)

  • ట్రాన్స్‌క్యులెంట్‌ పౌడర్‌

  • ఐ షాడో ప్యాలెట్‌

  • బ్రషెస్‌ (బ్లెండింగ్‌, అప్లికేషన్‌ కోసం)

  • ఐ లైనర్‌

  • లష్‌ కర్లర్‌, మస్కారా.

Updated Date - 2023-08-12T11:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising