Face: ముఖమే ఆరోగ్యానికి అద్దం
ABN, First Publish Date - 2023-06-27T14:49:59+05:30
ముఖం మీద మొటిమలు వచ్చి, తగ్గుతూ ఉండడం సహజం. అయితే ముఖం మీద ఒకే ప్రదేశంలో మొటిమలు తలెత్తుతూ ఉంటే మాత్రం అది అంతర్గత అనారోగ్యానికి సూచనగా భావించాలి. ఏ ప్రదేశంలో మొటిమలు ఎలాంటి అనారాగ్యాన్ని సూచిస్తాయంటే?
ముఖం మీద మొటిమలు వచ్చి, తగ్గుతూ ఉండడం సహజం. అయితే ముఖం మీద ఒకే ప్రదేశంలో మొటిమలు తలెత్తుతూ ఉంటే మాత్రం అది అంతర్గత అనారోగ్యానికి సూచనగా భావించాలి. ఏ ప్రదేశంలో మొటిమలు ఎలాంటి అనారాగ్యాన్ని సూచిస్తాయంటే?
● చెవులు, కణతలు: ఇవి మూత్రపిండాల అనారోగ్యానికి సూచికలు. అలాగే డీహైడ్రేషన్, లింఫ్ స్రావాల ప్రసారంలో అడ్డంకులు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తినడం, ఒత్తిడి, చర్మ నూనెలు ఎక్కువగా స్రవించడం వల్ల కూడా ఈ ప్రదేశాల్లో మొటిమలు తలెత్తుతాయి.
● ముక్కు: రక్తపోటు, రక్తప్రసారంలో లోపాలు, పోషకాహార లోపం, మలబద్ధకం, అజీర్తి, ఎక్కువ ఉప్పు వాడకం
● కుడి చెంప: ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థల సమస్యలు, అలర్జీలు, పొట్టలో ఇబ్బందులు, ఎక్కువ చక్కెర తినడం, ఒత్తిడి, మురికి దిండు కవర్లు, ఫోన్ కవర్లు
● పెదవుల చుట్టూ: హార్మోన్లు, పేగుల్లో ఇబ్బందులకు సూచికలు. హార్మోన్లలో అవకతవకలు, పునరుత్పత్వి వ్యవస్థలో సమస్యలు, మలబద్ధకం వంటివి కూడా కారణాలే!
● నుదురు: మూత్రాశయం, పేగుల్లో ఇబ్బందులకు సూచికలు, జీర్ణసంబంధ సమస్యలు, కాలేయ సమస్యలు, టాక్సిన్లు చేరడం, చమట, ఒత్తిడి, ఆందోళన కూడా కారణాలే!
● కనుబొమల మధ్య: కాలేయం, పొట్టలో సమస్యలు, డీహైడ్రేషన్, ఎక్కువగా మద్యపానం, నూనె పదార్థాలు తినడం
● కళ్ల అడుగున: మూత్రపిండాలు, కాలేయం, పేగుల్లో సమస్యలకు సూచికలు. నిద్రలోపం, డీహైడ్రేషన్, మేకప్ మలినాలు, కళ్లు రుద్దుకోవడం వల్ల కూడా కళ్ల దిగువన మొటిమలు వస్తాయి.
● ఎడమ చెంప: కాలేయంలో సమస్యలను సూచికలు, మితిమీరిన తిండి, పోషకాల శోషణలో లోపం ఒత్తిడి.
Updated Date - 2023-06-27T14:49:59+05:30 IST