ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Beauty: నూతనంగా... న్యాచురల్‌గా..

ABN, First Publish Date - 2023-10-07T12:49:02+05:30

దంసహజత్వంలోనే ఉంటుంది. మేక్‌పకూ ఈ సూత్రం వర్తిస్తుంది. మరి ఓ పక్క మేకప్‌ వేసుకుంటూ సహజంగా కనిపించడమెలా అనుకుంటున్నారా? అందుకోసం న్యాచురల్‌గా కనిపించేలా చేసే మేకప్‌ సూచనలు పాటించాలి.

దంసహజత్వంలోనే ఉంటుంది. మేక్‌పకూ ఈ సూత్రం వర్తిస్తుంది. మరి ఓ పక్క మేకప్‌ వేసుకుంటూ సహజంగా కనిపించడమెలా అనుకుంటున్నారా? అందుకోసం న్యాచురల్‌గా కనిపించేలా చేసే మేకప్‌ సూచనలు పాటించాలి.

నో మేకప్‌ లుక్‌ అని ముద్దుగా పిలుచుకునే న్యాచురల్‌ మేకప్‌ కోసం తేలికగా ఉండే హైడ్రేటింగ్‌ మాయిశ్చరైజర్‌, రేడియన్స్‌ ప్రైమర్‌, తేలికగా ఉండే ల్యుమినైజింగ్‌ ఫౌండేషన్‌, కన్‌సీలర్‌, ఐల్యాష్‌ కర్లర్‌, మస్కారా, బ్లాక్‌ ఐలైనర్‌, బ్రాంజర్‌, క్రీమ్‌ బ్లష్‌, లిప్‌స్టిక్‌ సమకూర్చుకోవాలి.

చర్మాన్ని ఇలా సిద్ధం చేయాలి: ముఖాన్ని శుభ్రం చేసి, తేలికపాటి మాయిర్చరైజర్‌ అప్లై చేయాలి. ప్రైమర్‌తో ముఖానికి నునుపుదనం తీసుకురావాలి. మేక్‌పకు ముందు ముఖాన్ని ఇలా సిద్ధం చేయడం వల్ల తర్వాత వేయబోయే మేక్‌పతో ముఖం సహజసిద్ధ లుక్‌ను పొందుతుంది.

ఫౌండేషన్‌: ఫౌండేషన్‌ చర్మపు రంగులో కలవకపోతే, రెండు వేర్వేరు ఫౌండేషన్‌లను రంగరించి చర్మపు రంగుతో మ్యాచ్‌ అయ్యేలా చేసుకోవాలి. ముఖం మీద ఫౌండేషన్‌ సమంగా పరుచుకోవడం కోసం బఫింగ్‌ బ్రష్‌ను ఉపయోగించాలి. ముఖానికి అద్దేసి వదిలేయకుండా, కొంత సమయం తీసుకుని సహజమైన లుక్‌ వచ్చేవరకూ బఫింగ్‌ చేయాలి.

కన్‌సీలర్‌: కళ్ల దగ్గరి నలుపును దాచేస్తూ, కళ్లు ఆకర్షణీయంగా కనిపించడం కోసం కన్‌సీలర్‌ అప్లై చేయాలి. ఇందుకోసం కళ్ల దిగువన, ‘వి’ ఆకారంలో కన్‌సీలర్‌ అప్లై చేసి, నలుపు మయామయ్యేవరకూ బఫింగ్‌ చేయాలి.

ఐ మేకప్‌: ఐ ల్యాష్‌ కర్లర్‌తో కనురెప్పలు తిప్పుకోవాలి. తర్వాత మస్కారాతో కనురెప్పలను తీర్చిదిద్దాలి. దీంతో కనురెప్పలకు చిక్కదనం సమకూరుతుంది. తర్వాత నల్లని ఐలైనర్‌తో మస్కారా అంచులు దిద్దుకోవాలి.

బ్రో జెల్‌: కనుబొమలను ఐబ్రో పెన్సిల్‌కు బదులుగా బ్రో జెల్‌తో తీర్చిదిద్దడం వల్ల అవి సహజసిద్ధంగా కనిపించడంతో పాటు, ముఖాకృతిని ఇనుమడింపజేస్తాయి.

బ్రాంజర్‌: చీక్‌ బోన్స్‌ మీద బ్రాంజర్‌ను చాలా పలుచగా అప్లై చేయాలి. తర్వాత లేత గులాబీ రంగు బ్లషర్‌ అప్లై చేయాలి. బ్లషర్‌ బ్రష్‌తో చీక్‌ బోన్స్‌ నుంచి బయటి వైపుకు బ్లష్‌ను అద్దుకోవాలి.

లిప్‌స్టిక్‌: బ్లష్‌ కోరల్‌ లేదా లేత గులాబీ రంగుదైతే, మ్యూటెడ్‌ లిప్‌ కలర్‌ లేదా టింటెడ్‌ లిప్‌ బామ్‌తో పెదవులను అద్దుకోవాలి. లేదంటే మీ పెదవుల రంగుతో మ్యాచ్‌ అయ్యే గులాబీ రంగు లిప్‌ కలర్‌ను పలుచగా అప్లై చేసుకోవచ్చు.

  • అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యమైన సౌందర్య సాధనాలు, పరికరాలు ఉపయోగించాలి. అప్పుడే సహజసిద్ధమైన మేకప్‌ లుక్‌ మీ సొంతమవుతుంది.

Updated Date - 2023-10-07T12:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising