ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Summer care: వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ABN, First Publish Date - 2023-05-16T13:07:23+05:30

మండే ఎండల ప్రభావానికి గురి కాకుడా ఉండాలంటే ఎండ దెబ్బ తగిలే వీల్లేని జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం...

Summer care
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండే ఎండల ప్రభావానికి గురి కాకుడా ఉండాలంటే ఎండ దెబ్బ తగిలే వీల్లేని జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం...

హైడ్రేషన్‌: ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సరిపడా నీళ్లు తాగుతూ శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉంచుకోవాలి. అలాగే వ్యాయామం చేసే సమయంలో, చమట ద్వారా ఒంట్లో నుంచి బయటకు వెళ్లిపోయే లవణాలను ఉప్పు, చక్కెర, తక్కువ పరిమాణాల్లోని ఎలక్ట్రొలైట్లతో భర్తీ చేస్తూ ఉండాలి.

వ్యాయామం: వేసవిలో తీవ్రమైన శ్రమకు లోను చేసే వ్యాయామాలను తగ్గించాలి. అలాగే ఔట్‌డోర్‌ వ్యాయామాలకు బదులుగా గాలి ధారాళంగా ఉండే ఇండోర్‌ వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎసి: ఎసి నుంచి హఠాత్తుగా ఎండలోకి వెళ్లడం సరి కాదు. కాబట్టి శరీరాన్ని నెమ్మదిగా వేడికి అలవాటు చేయాలి.

ఊబయాయం: అధిక బరువు కలిగిన వాళ్లకు వేసవి వెతలు ఎక్కువ. అధిక బరువు వల్ల శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు. దాంతో శరీరంలో వేడి నిల్వ ఉండిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలి.

దుస్తులు: వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, చలువ కళ్లజోడు ధరించాలి.

Updated Date - 2023-05-16T13:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising