ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Immunity: వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2023-08-21T11:22:25+05:30

వర్షాకాలంలో అలర్జీలు, దగ్గు, జలుబుతో పాటు ఇతర చర్మసంబంధ వ్యాధులు కలుగుతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి.

వర్షాకాలంలో అలర్జీలు, దగ్గు, జలుబుతో పాటు ఇతర చర్మసంబంధ వ్యాధులు కలుగుతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి.

  • పీచుపదార్థం, యాంటీ యాక్సిడెంట్స్‌తో పాటు విటమిన్‌- సి ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే సీజనల్‌ పండ్లు నిమ్మ, మోసంబి, నారింజ, బొప్పాయి, దానిమ్మ, యాపిల్స్‌ తినాలి. వీటితో పాటు తాజా కూరగాయలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

  • బాదం గింజల్లో విటమిన్‌- ఇ అధికంగా ఉంటుంది. దీని వల్ల సెల్‌ డ్యామేజీ కలగకుండా ఉంటుంది.

  • అల్లం టీ తాగటం లేదా ఆహారంలో అల్లం కలిపి కుక్‌ చేస్తే సరి. ఎందుకంటే అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్‌ అల్లం.

  • విటమిన్‌-డి లోపం ఎక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఈ విటమిన్‌ వల్ల ఎముకల ఆరోగ్యం కలుగుతుంది. కోడిగుడ్లలో డి- విటమిన్‌ లభిస్తుంది. అందుకే పిల్లలైనా పెద్దలైనా రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీని పొందుతారు.

  • వేల సంవత్సరాలనుంచి పుట్టగొడుగులు తినటం వల్ల ఆరోగ్యం చేకూరుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచటమే కాదు వాటిని యాక్టివ్‌గా ఉండేట్లు చేస్తాయి. దీనివల్ల అలర్జీలు దరిచేరవు.

  • పసుపు అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్‌. గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగితే చక్కని ఫలితం ఉంటుంది.

  • పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఇ-విటమిన్‌ పుష్కలం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల కణాలు డ్యామేజ్‌ కావు.

  • పప్పుధాన్యాలు, చికెన్‌, చేపలు తినటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

  • పెరుగులో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కూడా మంచి జరుగుతుంది.

Updated Date - 2023-08-21T11:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising