ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health: ఒక్కో రంగుకు ఒక్కో బెనిఫిట్ ఉందని తెలుసా!

ABN, First Publish Date - 2023-06-13T14:17:27+05:30

ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో విలువైన పోషకాలుంటాయి. వాటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ను

Health benefits
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో విలువైన పోషకాలుంటాయి. వాటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయి. అయితే ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అవేంటంటే...

ఆకుపచ్చ: ఈ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం సొర, బీర, బెండ కూరగాయలతో పాటు, జామ, అవకాడొ, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి.

పర్పుల్‌, నీలం: జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్‌రూట్‌ తినాలి.

ఎరుపు: గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అఽధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం రెడ్‌ క్యాప్సికం, టమాటా, పండు మిరప, చెర్రీ తినాలి.

పసుపు, నారింజ: కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్‌ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్‌, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలి.

తెలుపు, గోధుమ రంగు: పెద్దపేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి.

Updated Date - 2023-06-13T14:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising