ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H3N2 Virus: ఎక్కువ ముప్పు ఇలాంటి వారికే! ఓ కన్నేసి ఉంచండి!

ABN, First Publish Date - 2023-03-14T12:16:48+05:30

వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఐసొలేషన్‌, వ్యాయామం, పౌష్ఠికాహారం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, జీవనశైలి మార్పులు. కొన్ని సందర్భాల్లో

ఓ కన్నేసి ఉంచండి!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

2009లో వచ్చిన స్వైన్‌ఫ్లూ (Swine flu) (హెచ్‌1ఎన్‌1) ను పోలిన ఇన్‌ఫ్లూయెంజా1 రూపాంతరం చెంది, హెచ్‌3ఎన్‌2గా అవతరించి, ఇటీవలి కాలంలో వ్యాప్తి చెందుతోంది. అన్ని ఫ్లూ వైర్‌సలనె పోలిన ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు తీవ్రంగా ఉండడం, వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి దీని పట్ల అప్రమత్తత అవసరం.

కొవిడ్‌ (covid)ను పోలిన ప్రవర్తనతో విస్తరిస్తున్న ఈ వైరస్‌ రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, శ్వాస సంబంధ వ్యాధులున్న వారికి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.

  • దగ్గు, జ్వరం, గొంతు నొప్పి

  • చలి, ముక్కు కారడం, దిబ్బెడ

  • తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట

  • వికారం, వాంతులు, విరోచనాలు

  • కొంతమందిలో ఫిట్స్‌

  • ఆయాసం

  • ఛాతీ నొప్పి, బ్రాంఖైటిస్‌, న్యుమోనియా, చెవి సమస్యలు

15 సంవత్సరాల లోపు మరీ ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, కీమో, రేడియోథెరపీ తీసుకుంటున్న కేన్సర్‌ రోగులు, డయాలసిస్‌ చేయించుకున్న వారు, ఎయిడ్స్‌ రోగులు, ఇమ్యూనిటీ తగ్గినవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది.

చికిత్స ఇదే!

ఐదు నుంచి వారంలో రోజుల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్లూ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. చికిత్స తీసుకోవాలనుకున్నవారు వైద్యులు సూచించిన యాంటీవైరల్‌ కోర్సు పూర్తి చేసుకోవాలి. ప్రతి ఫ్లూ జ్వరానికీ యాంటీబయాటిక్స్‌ వాడుకోకుండా, బ్యాక్టీరియా వల్ల సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన సందర్భంలో, వైద్యుల సూచన మేరకే మందులు వాడుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే, త్వరగా కోలుకోవచ్చు.

ఫ్లూ జ్వరాలకు హోమియో వైద్యం

వైరస్‌ సోకకుండా ప్రివెంటివ్‌ మెడిసిన్‌, లక్షణాల ఆధారంగా చికిత్స, వైరస్‌ తీవ్రత తగ్గినా రోగిలో బలహీనతను పోగొట్టి, దుష్ప్రభావాలను తగ్గించే చికిత్స... హోమియోలో ఇలా మూడంచెల చికిత్సా విధానం ఉంటుంది.

ముఖ్య ఔషధాలు

అకొనైట్‌: ఆకస్మికంగా చల్లగాలికి బహిర్గతం కావడం మూలంగా వచ్చిన ఇన్‌ఫ్లూయెంజా

అనాస్‌ బార్బరియే: లక్షణాలు కనిపించిన మొదటి 48 గంటల్లో, ఫ్లూ వేగంగా ప్రారంభమైనప్పుడు ప్రాథమిక వైద్యంగా తీసుకోవచ్చు.

అర్సెనిక్‌ ఆల్బం: ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములకు ఈ మందు వాడుకోవాలి.

జెల్సీమియం: ముక్కు కారడం, మగత, బలహీనత ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు.

యుపటోరియం పర్ఫ్‌: ఇన్‌ఫ్లూయెంజా జ్వరం, ఎముకల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

రూస్టాక్స్‌: శరీరం మీద చల్ల నీళ్లు పోసినప్పుడు, రక్తం శిరల ద్వారా చల్లగా ప్రవహించినట్టు ఉంటుంది. నాలుక పొడిగా, త్రిభుజాకార కొనను కలిగి ఉండడం ముఖ్య సూచన.

బాప్టిసియా: ఎపిడెమిక్‌ ఇన్‌ఫ్లూయెంజాలో వాడదగిన ఔషధం.

ఇన్‌ఫ్లుయెంజినమ్‌: ఒక మందు విఫలమైనప్పుడు పునరావృత ఔషధంగా వాడుకోవచ్చు.

బ్రయోనియా ఆల్బ్‌: న్యూమోనియా, ఫ్లూ కలిసి ఉన్నప్పుడు వాడుకోవాలి. కండరాల నొప్పులు కూడా ఉంటాయి.

కాలీ బైక్రోమికం: జ్వరం తర్వాత దగ్గు ఉన్నప్పుడు దీన్ని వాడుకోవాలి. తీగలుగా అంటుకునే కఫం, బలహీనత ఉంటాయి.

అమ్మోనియం కార్బ్‌: బ్రయోనియా మందు విఫలమైనప్పుడు, ఇన్‌ఫ్లూయెంజా తర్వాతి దగ్గుకు ఉపయోగకరం.

కార్బొవెజ్‌: ఇన్‌ఫ్లూయెంజా తదనంతర బలహీనత, ఆక్సిజన్‌ లోపం సమస్యలకు ఈ మందు ఉపయోగకరం.

జాగ్రత్తలు

వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఐసొలేషన్‌, వ్యాయామం, పౌష్ఠికాహారం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, జీవనశైలి మార్పులు. కొన్ని సందర్భాల్లో ప్రివెంటివ్‌ మందు వాడిన తర్వాత, కొంతమందికి వైరస్‌ సోకవచ్చు. అంతమాత్రాన మందు పని చేయలేదని అనుకోకూడదు. ప్రివెంటివ్‌ మందు వల్ల రోగుల్లో వ్యాధి త్రీవత పెరగకుండా ఉంటుందని రుజువైంది. ఇక్కడ సూచించిన మందులు కేవలం అవగాహన కోసమే! ఫ్లూ లక్షణాలు తలెత్తినప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవడం అవసరం.

-డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ రావు గన్నం రాజు సీనియర్‌ హోమియోపతి వైద్యులు.

ఫోన్‌: 9849182691

Updated Date - 2023-03-14T12:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising