Migraine: మైగ్రెయిన్‌తో బాధపడుతున్నా? ఆ చికిత్స కరెక్టేనా?
ABN, First Publish Date - 2023-04-20T17:59:02+05:30
డాక్టర్ నా వయసు 20. గత కొంతకాలంగా మైగ్రెయిన్‌తో బాధపడుతున్నాను. హోమియోలో ఈ సమస్యకు సమర్థమైన చికిత్స ఉందా?
డాక్టర్ నా వయసు 20. గత కొంతకాలంగా మైగ్రెయిన్‌తో బాధపడుతున్నాను. హోమియోలో ఈ సమస్యకు సమర్థమైన చికిత్స ఉందా?
- ఓ సోదరి, హైదరాబాద్.
మైగ్రెయిన్ పరీక్షల్లో బయటపడే సమస్య కాదు కాబట్టి, లక్షణాలను బట్టి, తీవ్రతలను బట్టి ఆ నొప్పిని అదుపులో ఉంచే చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. ఈ పార్శ్వపు నొప్పి ఎంత తరచుగా వేధిస్తోంది, ఎంత తీవ్రంగా ఉంటోంది... మొదలైన అంశాల ఆధారంగా చికిత్స చేయవలసి ఉంటుంది. కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా, తరచూ తిరగబెట్టకుండా చేసే మందులు హోమియోపతిలో ఉన్నాయి. కొంత మందిలో ఈ మందులు మైగ్రెయిన్‌ను శాశ్వతంగా అరికడతాయి. అలాగే ఈ చికిత్సలో భాగంగా మైగ్రెయిన్‌తో పాటు అనుబంధంగా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కలిపి చికిత్స అందించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అయితే ఈ మందులను వైద్యుల సలహా మేరకే వాడుకోవాలి. హోమియోలో మైగ్రెయిన్‌కు ఉపయోగపడే మందులు ఇవే!
బెలడోన: అకాసాత్తుగా తీవ్రమైన నొప్పి మొదలై, కళ్లు, ముఖం ఎర్రబడతాయి. వెలుతురు చూడలేరు.
బ్రయోనియా: ఏమాత్రం కదిలినా తలనొప్పి ఎక్కవవుతూ ఉంటుంది. వెలుతురు, శబ్దం భరించలేరు. అతి దాహం ఉంటుంది. తలను అదిమినట్టు పట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
జెల్సీమియం: తల బరువుగా ఉండడం, మెడ వెనక భాగం నుంచి నొప్పి మొదలవడం, తలలో పోట్లు, కళ్ల ముందు మెరుపులు కనిపించడం
శాంగ్వినేరియా: కుడి వైపు తల నొప్పి, మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలలో కనిపిస్తుంది.
స్పైజీలియా: ఎడం వైపు తల నొప్పి, గుండె దడ
ఐరిస్ వర్స్: తల కుడి భాగంలో నొప్పి, చెవి, కణతలు పగిలిపోతున్నంత బాధ, నొప్పి సూర్యోదయంతో మొదలై, సూర్యాస్తమయంతో ఉపశమనం
పొందుతారు.
తూజా: ఎడమ కణతలో, తలలో నొప్పి, తలపై మేకులు గుచ్చినంత బాధ, వికారం
లాక్ కేన్: తల నొప్పి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు మారుతూ ఉంటుంది.
ఇగ్నీషియా: కోపం, దిగులు, దుర్వార్తలు తెలియగానే మొదలయ్యే తలనొప్పి
కాక్యులస్: ప్రయాణంతో వచ్చే తలనొప్పి, వాంతులు
సిడ్రాన్, పల్సటిల్లా, కాలీ ఫాస్, డామియానా, ఇపెకాక్ మొదలైన మందులతో కూడా ఫలితం ఉంటుంది.
రోగ లక్షణాల ఆధారంగా, కుటుంబ చరిత్ర లేదా దృష్టిలో తేడాలను బట్టి మైగ్రెయిన్‌ను నిర్థారించి, చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సి.బి.పి, థైరాయిడ్, కిడ్రీ ఫంక్షన్, ఎలకొ్ట్రలైట్స్ మొదలైన పరీక్షలు మైగ్రెయిన్ నిర్థారణకు కొంత మేరకు తోడ్పడతాయి. మైగ్రెయిన్ సమస్యతో పాటు అనుబంధ సమస్యలకు కలిపి హోమియో మందులు వాడుకోవలసి ఉంటుంది. అయితే ఈ నొప్పి తీవ్రత, బాధించే సమయం ఎక్కువ కాబట్టి దాన్ని అదుపులో ఉంచడం కోసం మందు డోసును ఎక్కువసార్లు తీసుకోవలసి వస్తుంది. హోమియో మందులు మెదడు, శరీరాలు... రెండింటి మీదా ప్రభావం చూపిస్తాయి కాబట్టి మైగ్రెయిన్ నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ మందును నాలుక మీద ఉంచుకున్నప్పుడు, అక్కడి సున్నితమైన నరాల ద్వారా వేగంగా మెదడుకు చేరి, అక్కడి నరాల ఒత్తిడి తగ్గడం మూలంగా మైగ్రెయిన్ నొప్పి అదుపులోకొస్తుంది.
-డాక్టర్ దుర్గాప్రసాద రావు గన్నంరాజు,
హోమియో వైద్య నిపుణులు, హైదరాబాద్.
Updated Date - 2023-04-20T17:59:02+05:30 IST