Hormone Health: హార్మోన్లు సమర్థవంతంగా పని చేయాలంటే..!
ABN, First Publish Date - 2023-07-11T12:57:21+05:30
ఉత్పాదకత, ఆనందం, ఏకాగ్రత.. వీటిని పెంచుకోవాలంటే నాలుగు హార్మోన్ల పనితీరును సమర్థంగా ఉండేలా చూసుకోవాలి.
ఉత్పాదకత, ఆనందం, ఏకాగ్రత.. వీటిని పెంచుకోవాలంటే నాలుగు హార్మోన్ల పనితీరును సమర్థంగా ఉండేలా చూసుకోవాలి.
సెరటోనిన్: నిద్ర, మూడ్, సంతోషం, ఇంకొన్ని జీవక్రియలకు క్రమబద్ధం చేసే ఈ హార్మోన్ సమర్థంగా విడుదల కావాలంటే....
ట్రిప్టోఫాన్ అనే అమీనో యాసిడ్ సమృద్ధిగా దొరికే గుడ్లు, చీజ్, చేపలు తినాలి.
క్రమం తప్పక వ్యాయామం చేయాలి. నడక కూడా వ్యాయామమే! కాబట్టి ప్రతి రోజూ 30 నిమిషాలు నడిచినా చాలు.ధ్యానం చేయాలి. శరీరారికి ఎండ సోకేలా చూసుకోవాలి.
డోపమైన్: ఆనందాన్ని అందించే వాటిని పొందడానికి పోత్సహించే హార్మోన్ ఇది. అయితే కొన్ని చవకబారు మార్గాల్లో లభించే ఆనందంతో ఏకాగ్రత, ప్రేరణలు కుంటుపడతాయి. ఈ హార్మోన్‌ను పొందాలంటే...
రోజువారీ అందుకోగల లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి.
సామాజిక మాధ్యమాల ఉపయోగం తగ్గించాలి.
11 నిమిషాల ఐస్ బాత్ లేదా చల్ల నీళ్ల స్నానం చేయాలి.
ఎండార్ఫిన్స్: ఇది పెయిన్ కిల్లర్ హార్మోన్. నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించి, ఒత్తిడిని తొలగించి, ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ హార్మోన్లు తగ్గితే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జయుటీలు పెరుగుతాయి.
రెసిస్టెన్స్ ట్రైనింగ్, వాకింగ్ క్రమం తప్పక చేయాలి.
డార్క్ చాక్లెట్ తినాలి (కోకో ఎండార్ఫిన్లను పెంచుతుంది)
మనసారా నవ్వాలి.
ఆక్సిటోసిన్: భావోద్వేగాల స్పందనలు, సామాజిక ప్రవర్తలను ఈ హార్మోన్ ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్ తగ్గితే, కమ్యూనికేషన్‌లో వెనకబడతాం. చీకాకు పెరుగుతుంది. ఒంటరితనం వేధిస్తుంది.
ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపాలి.
పెంపుడు జంతువులతో సమయం గడపాలి.
నచ్చిన అభిరుచికి సమయం వెచ్చించాలి.
Updated Date - 2023-07-11T12:57:21+05:30 IST