ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sleep: నిద్ర తగ్గితే ఎన్ని సమస్యలో తెలుసా!?

ABN, First Publish Date - 2023-06-20T12:55:56+05:30

రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలనే విషయం మనందరికీ తెలిసిందే! అయినా నిద్రను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ నిద్ర లోపం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి తెలిస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలనే విషయం మనందరికీ తెలిసిందే! అయినా నిద్రను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ నిద్ర లోపం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి తెలిస్తే, కచ్చితంగా తగినంత సమయాన్ని నిద్రకు కేటాయిస్తాం. ఇంతకూ నిద్ర లోపంతో ఒరిగే ఆరోగ్య నష్టాలు ఏవంటే...

మెదడు మందగిస్తుంది: నిద్రలో మెదడు, వ్యర్థాలను తొలగిస్తుంది. సరిపడా నిద్ర పోకపోతే, మెదడు సామర్థ్యం తగ్గి చీకాకు, తలనొప్పులు వేధిస్తాయి.

ఆందోళన: నిద్ర లోపం వల్ల మెదడులోని యాంటిసిపేటరీ రియాక్షన్లు ప్రేరేపితమవుతాయి. అలాగే ఒత్తిడికి అనుకూలంగా స్పందించే గుణం తగ్గుతుంది. దాంతో ఆందోళన పెరిగిపోతుంది.

అధిక బరువు: కంటి నిండా నిద్రతో ఆకలిని నియంత్రించే హార్మోన్లను సమతులంగా ఉంటాయి. నిద్ర తగ్గితే ఆకలిని పెంచే గ్రెలిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి, అవసరానికి మించి తింటూ బరువు పెరిగిపోతాం.

ఇమ్యూనిటీ: నిద్ర తగ్గితే ఇమ్యూనిటీ తగ్గి త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం.

మూడ్‌లో హెచ్చుతగ్గులు: భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని న్యూరోట్రాన్స్‌మీటర్లు నిద్రలోపంతో అదుపు తప్పుతాయి. దాంతో భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతాం.

గుండె జబ్బులు: నిద్రలో రక్తపోటు తగ్గుతుంది. నిద్రలోపంతో పెరిగే ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి, గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

మధుమేహం ముప్పు: నిద్రలేమితో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌తో సంబంధం ఉండే కార్టిసాల్‌, నోరిపైనిఫ్రైన్‌ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో మధుమేహం బారిన పడతాం.

అదుపు కోల్పోతాం: నిద్రలేమితో బ్యాలెన్స్‌ కోల్పోయి తేలికగా ప్రమాదాల బారిన పడతాం.

నిద్రతో ప్రయోజనాలు ఇవే!

రాత్రి 10 నుంచి రెండు గంటల మధ్య మన శరీరాలు అత్యధిక మోతాదుల్లో మెలటోనిన్‌ను తయారు చేస్తాయి. మెలటోనిన్‌ గ్రోత్‌ హార్మోన్‌ను ట్రిగ్గర్‌ చేస్తుంది. ఇది కణాలను మరమ్మత్తు చేసి, ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ను నియంత్రిస్తుంది. మెలటోనిన్‌ ఎంతో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్‌. ఇది పగటివేళ శరీరంలో ఉత్పత్తయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను తుడిచి పెట్టి, కణ, డిఎన్‌ఎ డ్యామేజీని అరికడుతుంది.

Updated Date - 2023-06-20T12:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising