నిమ్మకాయతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
ABN, First Publish Date - 2023-05-13T17:54:02+05:30
ఏ కాలంలోనైనా నిమ్మరసం తాగితే కాస్త చురుకు, ఒంటిలో తాజాదనం వస్తుంది. అయితే చర్మం ఆరోగ్యం కోసం
ఏ కాలంలోనైనా నిమ్మరసం తాగితే కాస్త చురుకు, ఒంటిలో తాజాదనం వస్తుంది. అయితే చర్మం ఆరోగ్యం కోసం నిమ్మతో స్నేహం చేయాల్సిందే. వేటికోసమో తిరగకుండా.. వంటగదిలో ఉండే నిమ్మతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇలా..
నిమ్మరసం లేదా నిమ్మకాయను సగానికి కోసి ముఖంపై మసాజ్ చేసినట్లు రుద్దితే కాస్త మంటగా అనిపిస్తుంది. చిన్నటి నల్లని వలయాలు మటుమాయం అవుతాయి.
ఇందులో విటమిన్ -సి పుష్కలం. పైగా కొల్లాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది కాబట్టి చర్మం పాడవ్వకుండా ఉంటుంది.
ఒక బౌల్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం, అంతే సమపాళ్లలో తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిముషాలు ఆగిన తర్వాత ఫేస్‌వాష్ చేసుకోవాలి. ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
ఒక చిన్న అలొవెరా ఆకులోని జెల్ తీసుకుని దానికి నిమ్మరసం కలిపి ముఖంమీద ఉండే నల్లటి వలయాల దగ్గర పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక బౌల్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసంలోకి కొద్దిగా పసుపు వేయాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి లేదా నొప్పులు ఉండే చోటు పట్టిస్తే నొప్పులు తగ్గిపోతాయి.
కోడిగుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పట్టిస్తే చర్మం తాజాగా ఉంటుంది.
నిమ్మరసంలో బేకింగ్ సోడా కొద్దిగా వేసి ఆ మిశ్రమాన్ని పట్టిస్తే అది అద్భుతమైన డియోడ్రెంట్‌లా పని చేస్తుంది.
వేటినీ మిక్స్ చేయకుండా కేవలం నిమ్మరసాన్ని ముఖానికి పట్టించుకుంటే చాలు.. పలురకాల చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. చర్మానికే కాదు జుట్టు సంరక్షణకూ నిమ్మ పాత్ర ఎనలేనిది.
నిమ్మతొక్కను ఎండబెట్టి దాన్ని పొడిగా చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మతొక్క పొడిలోకి రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి పేస్ట్‌కు సరిపడినట్లు రోజ్‌వాటర్ పోసి మిశ్రమాన్ని కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత కడిగేస్తే.. వలయాలు, నొప్పులు తగ్గిపోతాయి. చర్మం మిలమిలలాడి యంగ్ లుక్ వస్తుంది.
Updated Date - 2023-05-13T17:54:02+05:30 IST