Makeup: మేకప్ చెదిరిపోకుండా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2023-08-26T12:28:52+05:30
మేకప్ ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉండాలన్నా, మేక్‌పతో ముఖం కాంతి విహీనంగా మారిపోకుండా ఉండాలన్నా మేక్‌పకు ముందూ, తర్వాత కొన్ని నియమాలు పాటించాలి.
మేకప్ ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉండాలన్నా, మేక్‌పతో ముఖం కాంతి విహీనంగా మారిపోకుండా ఉండాలన్నా మేక్‌పకు ముందూ, తర్వాత కొన్ని నియమాలు పాటించాలి.
మేకప్‌కు ముందు: ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకోసం అదే పనిగా సుబ్బు రుద్దేసుకోకుండా, తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని మృదువుగా మర్దన చేసుకుని, గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.
ముఖాన్ని మెత్తని టవల్‌తో అద్దుకుని, తడి లేకుండా తుడిచి, తెరుచుకున్న చర్మ రంథ్రాలు మూసుకుపోయేలా ఐస్ ముక్కలతో ముఖం మీద రుద్దుకోవాలి.
తర్వాత చర్మాన్ని తుడిచి, వెంటనే మన్నికైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
అప్లై చేసే మాయిశ్చరైజర్ మరీ జిడ్డుగా ఉండకూడదు, మరీ పొడిగా ఉండకూడదు. చర్మంలో ఇంకిపోయేలా ఉండాలి.
సున్నిత చర్మం కలిగిన వాళ్లు ఫౌండేషన్ లుక్‌ను తెప్పించే మెడికేటెడ్ సన్‌స్ర్కీన్‌ను వాడుకోవాలి.
ముఖం మీద మొటిమలు ఉన్న వాళ్లు, చర్మ వైద్యుల సూచన మేరకు అందుకు తగిన మేకప్ మెటీరియల్‌ని మాత్రమే వాడుకోవాలి.
సాధారణంగా మేకప్ వేసుకున్న తర్వాత, దుస్తులు వేసుకుంటూ ఉంటారు. కానీ దుస్తులు వేసుకున్న తర్వాతే మేకప్ మొదలు పెట్టాలి.
మేకప్ పూర్తయిన తర్వాతే నగలు ధరించాలి.
మేకప్ తర్వాత: మేక్‌పతో ఇంటికొచ్చిన తర్వాత, దాన్ని తొలగించడానికి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి.
మేక్‌పతో నిద్రపోతే, చర్మ రంథ్రాలు మూసుకుపోయ చర్మం కళావిహీనంగా తయారవుతుంది, మొటిమలు కూడా వేధిస్తాయి.
మేక్‌పను క్లీన్సింగ్ మిల్క్, మన్నికైన కొబ్బరి నూనెలతో తొలగించాలి.
దూదితో ముఖాన్ని సున్నితంగా వలయాకారంలో రుద్దుకుని, చర్మ రంధ్రాల్లో ఇంకిపోయిన మేకప్ మొత్తాన్నీ తొలగించుకోవాలి.
తర్వాత సబ్బు లేదా ఫేస్‌వా్‌షతో ముఖాన్ని కడుక్కుని, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
Updated Date - 2023-08-26T12:28:52+05:30 IST