Hairline: వయసు పెరిగినా జుట్టు మునుపటిలా ఉండాలంటే..!
ABN, First Publish Date - 2023-06-10T12:00:45+05:30
మహిళల్లో సైతం వయసు పెరిగేకొద్దీ ‘హెయిర్ లైన్’ వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. దాంతో నుదురు పెద్దదిగా కనిపిస్తోందని
మహిళల్లో సైతం వయసు పెరిగేకొద్దీ ‘హెయిర్ లైన్’ వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. దాంతో నుదురు పెద్దదిగా కనిపిస్తోందని దిగాలు పడిపోవలసిన అవసరం లేదు. హెయిర్ లైన్‌ను సరిదిద్దే మేకప్ టిప్స్‌తో మునుపటిలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
కాంటూరింగ్
నుదురును దాచేయడం కోసం బ్యాంగ్స్, ఇతరత్రా హెయిర్ స్టైల్స్‌నే అనుసరించవలసిన అవసరం లేదు. మీది నల్ల జుట్టు అయినా, గోధుమ రంగు జుట్టు అయినా, కాంటూరింగ్‌తో రిసీడింగ్ హెయిర్‌లైన్‌ను సరిదిద్దుకోవచ్చు. మీది నల్ల జుట్టైతే, కాజల్ లేదా బ్రౌన్ షేడ్‌తో రిసీడింగ్ హెయిర్‌లైన్ దగ్గర కాంటూరింగ్ లైన్లను గీసుకోవాలి. తర్వాత బ్యూటీ బ్లెండర్‌తో ఆ లైన్ల మీద అద్దుకుంటే, సహజ వెంట్రుకల్లా కనిపిస్తాయి. గోధుమ రంగు జుట్టు ఉన్నవాళ్లు ముదురు గోధుమ రంగు షేడ్‌తో లైన్లను గీసుకోవచ్చు.
హెయిర్ బ్రషింగ్
హెయిర్ బ్రష్‌తో దువ్వుకుంటే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచీ దువ్వెనను పక్కన పెట్టేసి హెయిర్ బ్రష్‌ను వాడడం మొదలు పెట్టండి. దీంతో నుదుటి దగ్గరి జుట్టును ముందుకూ, వెనక్కి దువ్వుకుంటే, వెంట్రుకలు ఒత్తుగా కనిపించి, నుదుటి వైశాల్యం తగ్గుతుంది. కొన్ని వెంట్రుకలు నుదుటి మీదకు జారి పడేలా దువ్వుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే జుట్టును బలంగా వెనక్కి దువ్వకూడదు. ఈ అలవాటు ఉంటే మానుకోవాలి.
లేయర్స్
నుదుటి దగ్గర వెంట్రుకలను లేయర్స్‌గా కత్తిరించుకోవడం వల్ల కూడా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. వీటితో వెనక్కి జరుగుతున్న హెయిర్‌లైన్ కవర్ అయిపోయి, యవ్వనంగా కనిపించే వీలుంటుంది.
Updated Date - 2023-06-10T12:00:45+05:30 IST