ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mint leaf: పుదీనాలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ABN, First Publish Date - 2023-04-06T11:25:06+05:30

పుదీనా ప్రస్తావన 13వ శతాబ్దం నుంచి ఉంది. ఇదో అద్భుతమైన హెర్బల్‌ ప్లాంట్‌. 17 వ శతాబ్దంలో విరివిగా పుదీనాను పండించేవారు. ఆధునిక యుగంలోనూ పుదీనాకు

Mint leaf
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుదీనా ప్రస్తావన 13వ శతాబ్దం నుంచి ఉంది. ఇదో అద్భుతమైన హెర్బల్‌ ప్లాంట్‌. 17 వ శతాబ్దంలో విరివిగా పుదీనాను పండించేవారు. ఆధునిక యుగంలోనూ పుదీనాకు అధిక ప్రాధాన్యత ఉంది. పుదీనా (Mint leaf)ను టీతో పాటు మజ్జిగ, కూరల్లో, చట్మీకి వాడతాం. దీంతో పాటు నాన్‌వెజ్‌లో కలిపి తింటాం. ఇంతకీ ఈ పుదీనా ఉపయోగాలేంటీ...

  • యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగ్‌సగా పుదీనా పని చేస్తుంది. ఈ సంప్రదాయ మెడిసిన్‌ను కడుపులోకి తీసుకోవటం వల్ల టాక్సిన్స్‌ తొలగిపోతాయి. దీని వల్ల జీర్ణాశయం శుద్ధి అవుతుంది. జీర్ణక్రియ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరం కూల్‌గా ఉండేట్లు చేస్తుంది.

  • దీనివల్ల నొప్పులు, చర్మం మీద వాపులు తగ్గిపోతాయి. జలుబు, దగ్గు లాంటి వాటినుంచి ఉపశమనం కలుగుతుంది. ఇరిటేషన్‌ వచ్చేట్లు వచ్చే పొడి దగ్గు కూడా పుదీనా రసం లేదా పుదీనా ఆకులతో చేసిన ఆహారం తింటే ఉపశమనం కలుగుతుంది.

  • ఇదో హీలింగ్‌ ఫుడ్‌ అని కూడా అంటారు. తలనొప్పి ఉన్నప్పుడు ఇదో రిఫ్రెషింగ్‌ ఏజెంట్‌లా పని చేస్తుంది.

  • తిన్న ఆహారం సాఫీగా జీర్ణమవ్వటమే కాదు.. నోటిలో ఉండే దుర్వాసన పోగొడతాయివి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా టూత్‌పే్‌స్టలో పుదీనా వాడటానికి కారణమిదే.

  • జీవక్రియను వృద్ధి చేయటంతో పాటు బరువు తగ్గటానికి కూడా పుదీనా ఉపయోగపడుతుంది.

  • వీటిలో ఉండే శాలిసిలిక్‌ ఆమ్లం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా చర్మం కనిపిస్తుంది.

  • ఈ హెర్బల్‌ ఆకులు తినటం వల్ల సెరటోనిన్‌ విడుదలచేస్తుంది. ఇది డిప్రెషన్‌, ఒత్తిడి రాకుండా కాపాడుతుంది.

  • కండరాల నొప్పిని నివారిస్తుంది. అలర్జీలు, సన్‌బర్న్‌ లాంటి సమస్యలనుంచి రిలీఫ్‌ కలుగుతుంది.

Updated Date - 2023-04-06T11:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising