Health: గృహ వైద్యంతో కఫం పోగొట్టవచ్చు! అయితే ఇలా చేయండి!
ABN, First Publish Date - 2023-07-18T12:40:49+05:30
వానాకాలం కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటకొస్తేగానీ దగ్గు, జలుబు, జ్వరం తగ్గవు. దాన్ని బయటకి రప్పించటం కోసం ఈ గృహవైద్యం ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి.
వానాకాలం కఫం సమస్య సర్వసాధారణం. అయితే ఊపిరితిత్తుల్లోని కఫం బయటకొస్తేగానీ దగ్గు, జలుబు, జ్వరం తగ్గవు. దాన్ని బయటకి రప్పించటం కోసం ఈ గృహవైద్యం ఉపయోగపడుతుంది. ప్రయత్నించండి.
లెమన్ టీ: బ్లాక్ టీకి ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగండి.
యూకలిప్టస్ ఆయిల్: కఫాన్ని కరగించే పురాతనమైన గృహ చిట్కా ఇది. కొబ్బరి నూనెలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఛాతీ మీద రాసుకోవాలి.
ద్రాక్ష: ఊపిరితిత్తులకు ఉపశమనాన్నిచ్చి కఫాన్ని అక్కడి నుంచి బయటకి తెప్పించటంలో ద్రాక్ష సమర్థమైనది. కాబట్టి ద్రాక్ష రసం తాగండి.
నిమ్మకాయ: శరీరం నుంచి కఫాన్ని పారదోలాలంటే నిమ్మ చెక్కకు ఉప్పు, మిరియాల పొడి అద్ది నాకుతూ ఉండాలి.
ఉప్పు నీటి పుక్కిలింత: గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక టేబుల్‌స్పూను ఉప్పు కలిపి తలను కొద్దిగా వెనక్కి వంచి ఈ నీళ్లతో నోరు పుక్కిలించాలి. ఇలా చేసిన కొద్ది నిమిషాలకే కఫం వదులై బయటకొస్తుంది.
మిరియాలు, పసుపు: వేడి పాలలో అర టీస్పూను మిరియాల పొడి, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఉపశమనం కలిగి కఫం కూడా బయటకొస్తుంది.
అల్లం రసం: వేడి నీటిలో ఒక టేబుల్‌స్పూను అల్లం రసం, ఒక టీస్పూను తేనె కలుపుకుని నెమ్మదిగా తాగాలి.
Updated Date - 2023-07-18T12:40:49+05:30 IST