ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pomegranate: ఎముకలు దృఢంగా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2023-09-28T11:29:41+05:30

ఒక దానిమ్మలో 234 కేలరీలుంటాయి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు తిన్నా సులువుగా జీర్ణం అవుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే శక్తి వీటికి ఉంది.

ఒక దానిమ్మలో 234 కేలరీలుంటాయి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు తిన్నా సులువుగా జీర్ణం అవుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే శక్తి వీటికి ఉంది.

  • వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. దీనివల్ల కొన్ని రకాల వ్యాధులు రావు. వాపు, నొప్పుల్లాంటివి తగ్గిపోతాయి. ఇకపోతే ముఖ్యంగా గుండె సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా జిమ్‌ చేసిన తర్వాత కండరాలు యథాస్థితికి వచ్చి శక్తి నింపే గుణం దానిమ్మ విత్తనాలకు ఉంది.

  • దానిమ్మ గింజలు తింటే రక్తం పలుచబడుతుంది. రక్తకణాలకు ఆక్సిజన్‌ ఇస్తాయి. దీనివల్లశరీరంలో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలుండవు. దానిమ్మ గింజలను ఆక్సిజన్‌ మాస్క్‌లని కూడా పిలవచ్చు.

  • చక్కని లైఫ్‌ స్టయిల్‌ పాటించాలనుకునేవారు కచ్చితంగా ప్రతిరోజూ గుప్పెడు దానిమ్మ గింజలను తింటే ఆరోగ్యం. కొవ్వుశాతం తగ్గుతుంది. దీంతో పాటు గుండెకు పూడికలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

  • దానిమ్మలతో సావాసం చేస్తే వయసుపైబడిన వారికి కీళ్లనొప్పులు తగ్గిపోతాయి.

  • ప్రొటీన్లతో పాటు పొటాషియం, విటమిన్‌ సి, విటమిన్‌ కె.. లాంటివి లభ్యమవుతాయి.

  • పిల్లలకు, వయసు పైబడిన వారికి గింజల రూపంలో కాకుండా దానిమ్మరసం ఇవ్వటం కూడా చేయవచ్చు. ఇకపోతే కంటి చూపు బాగా పని చేసేందుకు దానిమ్మ ఉపయోగపడటంతో పాటు జ్ఞాపకశక్తికి మంచిది. అల్జీమర్స్‌ రాకుండా కాపాడుతుంది.

  • దానిమ్మ గింజలను తింటే ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌ విడుదలవుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

  • ఎముకల దృఢత్వానికి మేలు చేస్తుంది దానిమ్మ.

Updated Date - 2023-09-28T11:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising