Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? పరిశోధనలో ఏం తేలిందంటే..!
ABN, First Publish Date - 2023-06-28T13:05:45+05:30
బరువు తగ్గడం కోసం ఎక్కువ మంది ‘ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్’ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రకమైన ఉపవాసం గురించి యుకె, మాంచెస్టర్‌లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్, ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్ కాన్ఫరెన్స్‌లో ఒక పరిశోధనను ప్రెజెంట్ చేశారు. ఆ పరిశోధన సారాంశం ఏంటంటే...
బరువు తగ్గడం కోసం ఎక్కువ మంది ‘ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్’ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రకమైన ఉపవాసం గురించి యుకె, మాంచెస్టర్‌లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్, ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్ కాన్ఫరెన్స్‌లో ఒక పరిశోధనను ప్రెజెంట్ చేశారు. ఆ పరిశోధన సారాంశం ఏంటంటే...
పని సున్నా
• ఉపవాసం సమయంలో తగ్గే బరువు, కండరం, ఎముకల సాంద్రతలు తగ్గడంతో సమకూరుతుంది. కొవ్వు కరగడం వల్ల కాదు.
• ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీకి ప్రయోజనకరమైనది అని ఏ అధ్యయనంలో వెల్లడి కాలేదు. నిజానికి ఉపవాసంతో ఐఎమ్‌టిజి (ఇంట్రామస్క్యులర్ ట్రయాసిల్ గ్లిసరాల్) పెరగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది.
హాని ఎక్కువే!
• ఉపవాసంతో పొట్ట నుంచి ఆహారం ఖాళీ అయ్యే సమయం (గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్) నెమ్మదిస్తుంది.
• అసిడిటీ, తలనొప్పి, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి
• కెఫీన్ మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతుంది.
• తర్వాతి రోజు ఉపవాసానికి సిద్ధ పడడం కోసం, శరీరం శక్తిని ఖర్చు పెట్టనివ్వదు. ఆ క్రమంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.
ఉపవాసం అపోహలు
• వనరులు తక్కువగా ఉన్నప్పుడు సమర్థంగా పని చేయడం కోసం శరీరం ‘ఆటొఫజీ’ అనే మెకానిజంకు లోనవుతుంది. ప్రతికూల సమయాల్లో కూడా శరీరం ఇదే పని చేస్తుంది. కాబట్టి ఇది శరీరానికి చేటు కలిగించే పరిస్థితి.
• కీటోన్లతో అందే అనే పరిమిత శక్తి తేలికపాటి వ్యాయామాలకే సరిపోతుంది. హై పర్ఫార్మెన్స్‌తో కూడిన వ్యాయాయాలు చేయలేం.
బరువు తగ్గాలి, ఆరోగ్యం పెరగాలి
• స్థానికంగా దొరికేవీ, స్థానికంగా పండేవీ తినాలి.
• ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి
• వండే విధానాలు కూడా స్ధానికమైనవై ఉండాలి.
Updated Date - 2023-06-28T13:05:45+05:30 IST