ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sapota: సపోటా గురించి తెలిస్తే మాత్రం...!

ABN, First Publish Date - 2023-05-13T15:21:54+05:30

సపోటా తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు ఇది. ఇంతకీ సపోటా ఉపయోగాలేంటో

Sapota
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సపోటా తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు ఇది. ఇంతకీ సపోటా ఉపయోగాలేంటో తెల్సుకుందాం.

  • వందగ్రాముల సపోటా ముక్కల తింటే అందులో 83 కేలరీలుంటాయి. అందుకే ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

  • విటమిన్‌-సి తో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇందులో ఉంటాయి. అందుకే ఇవి మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ సపోటాను మెనూలో ఉంచుకోవచ్చు. వీటిలో కాల్షియం. పొటాషియం పాళ్లెక్కువ. దీని వల్ల ఎముకలు గట్టి పడతాయి.

  • మాంగనీసుతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపు మెరుగవుతుంది. ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాల వల్ల జీవక్రియ మెరుగవుతుంది.

  • సపోటా గుజ్జును ముఖంపై రుద్దితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి విత్తనాలతో చేసిన నూనెతో మర్దనం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది సపోటా. పిండిపదార్థం అధికంగా ఉండే ఈ పండు సులువుగా జీర్ణమవుతుంది.

Updated Date - 2023-05-13T15:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising