Skin: తేలికైన చిట్కాలతో చర్మం తాజాగా పెట్టుకోవచ్చు! ఎలాగంటే..!
ABN, First Publish Date - 2023-07-26T12:12:54+05:30
చర్మం(Skin) ఆరోగ్యంగా, తాజాగా, జీవం ఉట్టిపడుతూ ఉండాలంటే ఖరీదైన సౌందర్యసాధనాలు, సౌందర్య చికిత్సల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. తేలికైన చిట్కాలు పాటించి మెరుపులీనే చర్మం సొంతం చేసుకోవచ్చు.
చర్మం(Skin) ఆరోగ్యంగా, తాజాగా, జీవం ఉట్టిపడుతూ ఉండాలంటే ఖరీదైన సౌందర్యసాధనాలు, సౌందర్య చికిత్సల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. తేలికైన చిట్కాలు పాటించి మెరుపులీనే చర్మం సొంతం చేసుకోవచ్చు.
అదెలాగంటే....
నీరు: శరీరంలో నీటి శాతం తగ్గితే ఆ ప్రభావం మొదట చర్మం మీద పడుతుంది. కాబట్టి శరీరంలో నీరు తగ్గకుండా, డీహైడ్రేషన్(Dehydration)కు గురి కాకుండా చూసుకోవాలి. అందుకోసం రోజు మొత్తంలో కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. నీరుకు బదులుగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు కూడా తాగవచ్చు.
నిద్ర: చర్మ ఆరోగ్యానికి రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర లోపిస్తే చర్మం జీవం కోల్పోతుంది. ముడతలు కూడా ఏర్పడతాయి. చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి తోడ్పడే చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి కుంటుపడుతుంది. వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువ కాబట్టి జిడ్డు చర్మం కలిగిన వాళ్లు ముఖాన్ని పొడిగా ఉంచుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్ వాడకం పరిమితం చేయాలి.
మేకప్: మేకప్ వల్ల చర్మం పాడవకపోయినా, రాత్రివేళ దాన్ని తొలగించకపోతే చర్మ సమస్యలు తప్పవు. మేకప్(Makeup) వల్ల పూడుకుపోయిన చర్మ రంథ్రాలను తిరిగి తెరుచుకునేలా, మొటిమలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నిద్రకు ముందు మేకప్ పూర్తిగా తొలగించి, శుభ్రం చేసుకుని మన్నికైన మాయిశ్చరైజర్ పూసుకోవాలి.
Updated Date - 2023-07-26T12:44:09+05:30 IST