ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Makeup: ఉదయాన్నే చర్మం నిగనిగలాడాలంటే..!

ABN, First Publish Date - 2023-06-17T12:24:35+05:30

ఉదయాన్నే మెరుపులీనే చర్మంతో నిద్ర లేవాలనుకుంటే, రాత్రి నిద్రకు ముందే మేకప్‌ మొత్తాన్నీ తొలగించాలి. అయితే అందుకోసం

Makeup
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయాన్నే మెరుపులీనే చర్మంతో నిద్ర లేవాలనుకుంటే, రాత్రి నిద్రకు ముందే మేకప్‌ మొత్తాన్నీ తొలగించాలి. అయితే అందుకోసం ఉపయోగించే సాధనాలు ఎలా ఉండాలంటే....

క్లీన్సర్‌

మనం ఉపయోగించే డైలీ క్లీన్సర్‌ ఫౌండేషన్‌, బ్లష్‌లను పూర్తిగా తొలగించేదై ఉండాలి. ఇందుకోసం ముఖానికి క్లీన్సర్‌ అప్లై చేసి మర్దన చేసి, కొద్దిసేపు అలాగే వదిలేయాలి. మర్దన చేసే సమయంలో హెయిర్‌లైన్‌, చుబుకం దిగువన, కళ్ల చుట్టూరా ఉన్న ప్రదేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. తర్వాత కాటన్‌ వాష్‌ క్లాతతో క్లీన్సర్‌ను తుడిచేయాలి.

క్లీన్సింగ్‌ ఆయిల్‌

చర్మం పైనుంచి మేకప్‌ తొలగించే ప్రక్రియ సున్నితంగా సాగాలి. మేకప్‌ తొలగించే క్రమంలో చర్మం కందిపోవడం, డీహైడ్రేట్‌ అవడం లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం క్లీన్సింగ్‌ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. వేళ్లతో కొంత నూనెను తీసుకుని కనురెప్పలు, కనుబొమలు, పెదవులు, మిగతా ముఖం మీద అప్లై చేసి, మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీది మేకప్‌ వదులై, తేలికగా వదిలిపోతుంది. ఇలా మర్దన చేసిన తర్వాత, కాటన్‌ ప్యాడ్‌ తీసుకుని, దాని మీద కొద్దిగా క్లీన్సింగ్‌ ఆయిల్‌ పోసి, ఒకే దిశలో మేక్‌పను తొలగించాలి.

స్టీమ్‌ హీట్‌

వేడి నీళ్లతో రెండు నిమిషాలు ఆవిరి పట్టాలి. దాంతో చర్మ రంథ్రాలు తెరుచుకుని, క్లీనర్‌ తేలికగా వాటిలోకి చొరబడి మేక్‌పను సమూలంగా తొలగిస్తుంది. అదనపు మృదుత్వం, ఉపశమనం కోసం వేడి నీళ్లలో లావెండర్‌ నూనెను కూడా జోడించుకోవచ్చు.

కళ్ల పట్ల అదనపు శ్రద్ధ

మస్కారా, లైనర్‌లను తొలగించడం కష్టం. కళ్లు సున్నితమైనవి కాబట్టి మస్కారా, లైనర్‌లను స్క్రబ్‌ చేయలేం. కాబట్టి ఐ మేక్‌పను తొలగించడానికి ప్రత్యేకంగా ఆయిల్‌ బేస్‌డ్‌ కాటన్‌ ప్యాడ్స్‌ను ఉపయోగించాలి. వీటిని ఉపయోగించడం కోసం కళ్లు మూసుకుని కను రెప్పల మీద పది సెకన్ల పాటు ఉంచి, మృదువుగా రుద్ది మేక్‌పను తొలగించాలి. వాటర్‌ప్రూఫ్‌ మస్కారాను తొలగించడానికి క్లీన్సింగ్‌ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇందుకోసం రిమూవర్‌లో ప్యాడ్‌ను నానబెట్టి, మూసిన కనురెప్పల మీద కొద్ది సెకన్ల పాటు నొక్కి ఉంచి, ప్యాడ్‌ను మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మస్కారా పూర్తిగా తొలగిపోతుంది.

Updated Date - 2023-06-17T12:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising