ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sun stroke: వడదెబ్బ లక్షణాలు ఇవే..

ABN, First Publish Date - 2023-05-20T11:23:03+05:30

ఎండకూ, వేడికీ బహిర్గతమైతే వడదెబ్బ తగలడం సహజం. అయితే అవి ఎండదెబ్బ లక్షణాలని గుర్తించలేక, పట్టించుకోకుండా వదిలేస్తే, పరిస్థితి తీవ్రంగా పరిణమించే

sunstroke
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండకూ, వేడికీ బహిర్గతమైతే వడదెబ్బ తగలడం సహజం. అయితే అవి ఎండదెబ్బ లక్షణాలని గుర్తించలేక, పట్టించుకోకుండా వదిలేస్తే, పరిస్థితి తీవ్రంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సన్‌స్ట్రోక్‌ లక్షణాలను గమనించుకోవాలి.

అత్యధిక శరీర ఉష్ణోగ్రత:

శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుకున్నా, మించినా ఎండదెబ్బ తగిలినట్టు నిర్ధారించుకోవాలి. ఇలా జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.

గుండె వేగం:

శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది.

శ్వాస వేగం:

శరీరం వేడి తగ్గించుకోవడం కోసం త్వరత్వరగా శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. శరీరం వేడెక్కినప్పుడు గుండె విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరిచే ప్రక్రియతో, ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడం కోసం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవతుఉంది.

అయోమయం:

ఎండదెబ్బతో మెదడు పనితీరు మీద ప్రభావం పడుతుంది. దాంతో అయోమయం, కళ్లు తిరగడం, కొన్ని సందర్భాల్లో ఫిట్లు కూడా కనిపించవచ్చు. ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ ప్రభావితమై, సమన్వయం కోల్పోతాం. దిక్కుతోచని స్థితికి లోనవుతాం. కోపం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

తలనొప్పి:

తలనొప్పి, తలతిరుగుడు కూడా ఉంటుంది. డీహైడ్రేషన్‌ వల్ల, ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల ఇలా జరగవచ్చు.

వాంతులు:

శరీరం అవసరానికి మించి వేడెక్కడం మూలంగా వాంతులు మొదలవుతాయి.

చర్మం పొడిబారడం:

చర్మం పొడి బారి, వేడెక్కుతుంది. శరీరం ఎంత వేడెక్కినా చమట పట్టదు.

కండరాల నొప్పులు, నిస్సత్తువ:

సహజంగా వేసవిలో వ్యాయామం తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కూడా సన్‌స్ట్రోక్‌ లక్షణాలుగానే పరిగణించాలి.

మైకం:

చమట ద్వారా శరీరంలోని నీళ్లను కోల్పోయేకొద్దీ డీహైడ్రేషన్‌తో మైకం ఆవరిస్తుం

Updated Date - 2023-05-20T11:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising