ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lemon: నిమ్మరసం ఉదయాన్నే తాగితే...!

ABN, First Publish Date - 2023-09-01T12:48:21+05:30

నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. నిమ్మరసానికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకుందాం.

నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. నిమ్మరసానికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకుందాం.

ఏ సమయంలో తాగితే మంచిది?

ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగటం మంచిది. దీని వల్ల మన మెటాబాలిజం పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే నిమ్మరసం తాగిన తర్వాత మంచినీటితో నోటి శుభ్రపరుచుకోవటం మంచిది. లేకపోతే పళ్ల మీద ఉండే ఎనామిల్‌పై నిమ్మరసం ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీని వల్ల పళ్లు పాడైపోతాయి.

గోరు వెచ్చని నీళ్లా? చల్లటి నీళ్లా?

వాతావరణం ఆధారంగా.. ఆరోగ్యపరిస్థితి ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు వంటివాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వేసవి కాలంలో చల్లటి నీళ్లలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే బావుంటుంది.

ప్రయోజనాలివే..

  • నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే దాహం తీరుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది.

  • నిమ్మరసంలోని విటమిన్‌ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి.

  • నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువ తినే అవకాశముంది. తక్కువ ఆహారం తింటే బరువు తగ్గుతారు.

  • నిమ్మరసం తాగితే ముత్రాశయంలోని సిట్రేట్‌ విలువలు పెరుగుతాయి. సిట్రేట్‌ విలువలు పెరిగితే - కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

  • నిమ్మ వాసన వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

Updated Date - 2023-09-01T12:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising