Facts About Peanuts: పల్లీ పకోడీలంటే ఇష్టమా..? వేయించుకుని ఉప్పు, కారం చల్లుకుని మరీ పల్లీలను తింటుంటారా..? ఈ నిజాలు తెలుసుకోండి..!
ABN, First Publish Date - 2023-03-29T17:32:59+05:30
ఇన్ని పోషక విలువలు దాగి ఉన్నప్పటికీ చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని, గుండె జబ్బులు వస్తాయన్న భయాందోళనతో దూరంగా ఉంటారు. అసలు ఈ అపోహలు నిజామా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలను ఇష్టపడని వారే ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక వంటింట్లో అయితే ఇవి లేకుండా వంటలే ఉండవు. వేరుశనగ నూనె దగ్గర నుంచి ఆయా కర్రీస్‌లో గ్రేవీ కోసం విరివిగా పల్లీలు ఉపయోగిస్తుంటారు. ఇక ప్రతిరోజూ పల్లీల చట్నీ లేకుండా టిఫినే ఉండదు. ఇంకొంత మంది అయితే ఉడకబెట్టుకుని.. ఇంకొందరు వేంచుకుని.. మరికొందరు బెల్లంపాకంతో పల్లీ ఉండలు వేసుకుని మరీ తింటుంటారు. ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. టేస్టే కాదు.. దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అందుకే వీటిని ఆరోగ్యకరమైన చిరుతిళ్లుగా భావిస్తారు. ఈ వేరుశెనగల్లో పిండి పదార్థం, ప్రోటిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, పైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్ని పోషక విలువలు దాగి ఉన్నప్పటికీ చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని, గుండె జబ్బులు వస్తాయన్న భయాందోళనతో దూరంగా ఉంటారు. అసలు ఈ అపోహలు నిజామా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం.
100 గ్రాముల పల్లీలల్లో 567 క్యాలరీల శక్తి, 17 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 25 గ్రాముల ప్రోటీన్, 45 గ్రాముల కొవ్వులు, 10 గ్రాముల ఫైబర్, 90 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి పల్లీలల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే వీటిలో ఉండే కొవ్వులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అలాగే పల్లీలల్లో ఉండే ఫైటో స్టిరాల్ మనం తీసుకునే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్‌ను రక్తంలో కలవకుండా చేయడంలో సహాయపడుతుంది. పల్లీలల్లో ఉండే రసాయన సమ్మేళనాలు కాలేయంలో ఉండే మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి, దేహధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Doctors Secret: ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ముందుగా నాలుకను చూపించమంటారెందుకు..?
ఇక గర్భిణీ స్త్రీలు, పిల్లలు, బాలింతలు, వ్యాయామాలు చేసే వారు, ఆటగాళ్లు పల్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ తక్కువ ధరలో లభిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా ఉంటాం. అంతేకాకుండా పల్లీలను తినడం వల్ల బరువు పెరగకుండా కూడా ఉంటారని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాకుండా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Viveka Mureder Case : వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్.. ఏం జరుగుతుందో..!
చాలా మంది పల్లీలను నూనెలో వేయించి మసాలా పొడి, ఉప్పు, కారం చల్లుకుని తింటారు. ఇలా తీసుకోవడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అప్పుడే భూమిలో నుంచి తీసిన పచ్చి పల్లీలను తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చూసిస్తున్నారు. అలాంటి పల్లీలు దొరకని వారు రాత్రంతా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..
Updated Date - 2023-03-29T17:32:59+05:30 IST