ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cancer: కేన్సర్‌ వంశపారంపర్యంగా సంక్రమిస్తుందా? డాక్టర్లు ఏమంటున్నారంటే..!

ABN, First Publish Date - 2023-08-10T11:00:09+05:30

డాక్టర్‌! నా వయసు 25. మా పిన్ని, రొమ్ము కేన్సర్‌తో పోయింది. చికిత్స సమయంలో కేన్సర్‌ వంశపారంగా సంక్రమించే వ్యాధి అనే విషయం తెలిసింది. అలాంటప్పుడు, పిన్ని లాగే నాకూ కేన్సర్‌ వస్తుందా? అసలు నాకు కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందో, లేదో ముందుగానే తెలుసుకునే మార్గం ఉందా?

డాక్టర్‌! నా వయసు 25. మా పిన్ని, రొమ్ము కేన్సర్‌తో పోయింది. చికిత్స సమయంలో కేన్సర్‌ వంశపారంగా సంక్రమించే వ్యాధి అనే విషయం తెలిసింది. అలాంటప్పుడు, పిన్ని లాగే నాకూ కేన్సర్‌ వస్తుందా? అసలు నాకు కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందో, లేదో ముందుగానే తెలుసుకునే మార్గం ఉందా?

- ఓ సోదరి, వరంగల్‌.

ఈ అవకాశం 20% ఉంది. అయితే ఈ వ్యాధి తల్లి, తండ్రి... ఎవరి వైపు బంధువులకు ఉంది? దూర బంధుత్వమా? వారికి ఎలాంటి కేన్సర్‌ ఉంది? ఇలా వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటాయి. బంధువు లను ఫస్ట్‌ డిగ్రీ, సెకండ్‌ డిగ్రీ... ఇలా బంధుత్వ దూరాన్ని బట్టి వర్గీకరిస్తే.... తల్లి, చెల్లి, కూతురు దగ్గరి రక్త సంబంధీకులు ఫస్ట్‌ డిగ్రీ కోవలోకి వస్తారు. ఈ కోవకి చెందిన మహిళలకు వ్యాధి సంక్రమించే అవకాశాలు మిగతా వారి కంటే ఎక్కువ. మేనత్తలు, కజిన్స్‌ (వాళ్ల పిల్లలు)... సెకండ్‌ డిగ్రీకి చెందిన బంధుత్వం కలిగిన మహిళలకు వంశపారం పర్యంగా సంక్రమించే అవకాశాలు కొంత తగ్గుతాయి. కాబట్టి కుటుంబ చరిత్రను బట్టి అవకాశాలను లెక్కించవలసి ఉంటుంది. రొమ్ము కేన్సర్‌లో ట్రిపుల్‌ నెగిటివ్‌ రకానికి వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు మరీ ఎక్కువ. కాబట్టి ఈ రకమైన కేన్సర్‌ వంశంలో ఉంటే రెట్టింపు అప్రమత్తత అవసరం.

జీన్‌ టెస్ట్‌ అత్యవసరం

వంశపారంపర్యంగా రొమ్ము కేన్సర్‌ సంక్రమించే వీలున్న మహిళలకు ‘బ్రాకా టెస్ట్‌ (బిఆర్‌సిఎ) ఓ వరం లాంటిది. రొమ్ము కేన్సర్‌కు కారణమయ్యే 1 మరియు 2 జన్యువులను గుర్తించే పరీక్ష ఇది. 25 నుంచి 30 వేల ఖరీదు ఉండే ఈ పరీక్షతో వ్యాధి వచ్చే అవకాశాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంది. ఫలితాన్ని బట్టి, ఎంతో ముందుగానే నివారణ చికిత్సలను మొదలు పెట్టి వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అయితే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమించే వీలున్న మహిళలు ముందుగా కేన్సర్‌ వైద్య నిపుణుల్ని సంప్రతించి, వ్యాధి సంక్రమించే రిస్క్‌ ఉందనీ, పరీక్ష అవసరమనీ చెబితేనే ఈ పరీక్ష చేయించుకోవాలి. ఫలితం పాజిటివ్‌గా వస్తే మూడు రకాల చికిత్సా పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. మొదటిది.... సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌, ప్రతి 6 నెలలకు స్ర్కీనింగ్‌ (మామోగ్రఫీ, అలా్ట్రసౌండ్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌), క్రమం తప్పకుండా వైద్యులను సంప్రతించడం. రెండవది... రొమ్ము కేన్సర్‌ నుంచి రక్షణ కల్పించే ‘నోటి మాత్ర’! ఈ మాత్రలను వైద్యుల సూచన మేరకు వాడవలసి ఉంటుంది. మూడవ చికిత్సా పద్ధతి కేన్సర్‌ వచ్చే వీలున్న అవయవాన్ని తొలగించడం. ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ అనుసరించిన పద్ధతి ఇదే! వీళ్లలో రొమ్ము కేన్సర్‌ సంక్రమించే జన్యువులు ఉంటాయి. కాబట్టి వీళ్లకు లాగా ఎప్పటికైనా వ్యాధి వచ్చే అవకాశాలు 80 శాతానికి మించి ఉంటే, రొమ్ములు తొలగించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు.

-డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-08-10T11:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising