ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teeth: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు అవసరం!

ABN, First Publish Date - 2023-07-14T13:01:20+05:30

ఆహారం లేదా ఇతర పానీయాలు తీసుకునేప్పుడు పొట్టకంటే ముందు ఎక్కువగా సమస్య వచ్చేది దంతాలకే. అతి వేడి, అతి చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్‌ తొలగిపోతుంది. దీనివల్ల తొందరగా దంతాలు పాడవుతాయి. ఇలా కాకుండా జాగ్రత్తలు అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహారం లేదా ఇతర పానీయాలు తీసుకునేప్పుడు పొట్టకంటే ముందు ఎక్కువగా సమస్య వచ్చేది దంతాలకే. అతి వేడి, అతి చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్‌ తొలగిపోతుంది. దీనివల్ల తొందరగా దంతాలు పాడవుతాయి. ఇలా కాకుండా జాగ్రత్తలు అవసరం.

  • కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పాలు, చేపలు, మాంసం, ఆకుకూరలు.. ఇలాంటి కాల్షియం ఫుడ్‌ను తినటం వల్ల దంతాలతో పాటు చిగుళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.

  • బాదం, ధాన్యాలు, అరటిలాంటి మెగ్నీషియం ఉండే ఆహారాన్ని తినాలి. భోజనం తర్వాత దంతాలు మధ్య ఇరుక్కుపోయిన ఆహారం వదిలేస్తే త్వరగా పాడవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

  • అర్ధరాత్రి మేలుకోవటం.. ఉదయాన్నే నిద్రపోవటం చేసినపుడు ఆహారం జీర్ణం సరిగాకాదు. దీంతో పాటు దంతాలు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవటం వల్ల నోటిలోని దుర్వాసన అరికట్టవచ్చు. ఉదయం, రాత్రిపూట దంతాలను శుభ్రం చేసుకోవటం ఉత్తమం.

  • గట్టిగా ఉండే బఠానీలు, ఐస్‌ ముక్కల్ని, గట్టిగా ఉండే పండ్లను కొరకటానికి ప్రయత్నించకూడదు. దీనివల్ల దంతాలు త్వరగా దెబ్బతింటాయి.

  • చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తినకూడదు. సోడా,కాఫీ, చూయింగ్‌గమ్‌ లాంటి వాటి జోలికి పోకూడదు.

  • పిల్లలకు రెగ్యులర్‌గా దంతాలు శుభ్రం చేయించాలి.

  • పోషకాలుండే ఆహారం, సరైన నిద్రతో పాటు ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్లి

  • చెకప్‌ చేయించుకోవటం మంచిది.

Updated Date - 2023-07-14T13:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising