Vegetarians: అవయవాలు సరిగ్గా పని చేయాలంటే శాఖాహారులకు ఇవి తప్పనిసరి..!
ABN, First Publish Date - 2023-06-29T13:59:05+05:30
మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా.. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలన్నా.. ప్రొటీన్ చాలా ముఖ్యం. మాంసహారులకు ఈ ప్రొటీన్ మాంసం, కోడిగుడ్డ్లు మొదలైన వాటి నుంచి లభిస్తుంది. శాఖాహారులు తినే ఆహారంలో ప్రొటీన్ తక్కువ ఉంటుంది. అందువల్ల శాఖాహారులను ఈ కింది ఆహారపదార్థాలను తప్పనిసరిగా తినమని
మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా.. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలన్నా.. ప్రొటీన్ చాలా ముఖ్యం. మాంసహారులకు ఈ ప్రొటీన్ మాంసం, కోడిగుడ్డ్లు మొదలైన వాటి నుంచి లభిస్తుంది. శాఖాహారులు తినే ఆహారంలో ప్రొటీన్ తక్కువ ఉంటుంది. అందువల్ల శాఖాహారులను ఈ కింది ఆహారపదార్థాలను తప్పనిసరిగా తినమని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆ పదార్థాలేమిటో చూద్దాం..
గుమ్మిడి గింజలు
గుమ్మిడి గింజల్లో ప్రొటీన్‌తో పాటుగా ఫైబర్, ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ మొదలైనవన్నీ ఉంటాయి. అందువల్లే వీటిని ఉదయం బ్రేక్‌ఫా్‌స్టతో పాటుగా వీటిని కూడా తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డ్రైఫ్రూట్స్
జీడిపప్పు, బాదం, కిస్‌మి్‌సలు తినటం వల్ల శాఖాహారులకు పొట్రీన్ లభిస్తుంది. అయితే ఇవి ఎన్ని తినాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవి ఎక్కువ తింటే ఎక్కువ కేలరీలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి తినటం మంచిది.
తోఫు
తోఫును సోయాబీన్ నుంచి తయారుచేస్తారు. 100గ్రాముల తోఫు తింటే ఒక రోజుకు కావాల్సిన ప్రొటీన్ లభిస్తుంది. ఈ మధ్యకాలంలో తోఫును మాంసానికి బదులుగా కూడా వాడుతున్నారు.
పప్పులు.. తృణధాన్యాలు
ప్రతి రోజు తినే దిపప్పు..పెసరపప్పు..మినపప్పు..శనగపప్పులతో పాటుగా తృణధాన్యాలన్నింటిలోను కూడా ప్రొటీన్లు ఉంటాయి. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి.
Updated Date - 2023-06-29T13:59:05+05:30 IST