ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Skin Beauty: వెనిగర్‌ను ఈ విధంగా ఉపయోగిస్తే..!

ABN, First Publish Date - 2023-06-07T14:27:14+05:30

యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ను అనేక మంది సర్వరోగ నివారణిగా భావిస్తారు. కేవలం ఆరోగ్య సమస్యలను దూరం చేయటానికి మాత్రమే కాకుండా సౌందర్యపోషకంగా కూడా ఇది

Skin Beauty
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ను అనేక మంది సర్వరోగ నివారణిగా భావిస్తారు. కేవలం ఆరోగ్య సమస్యలను దూరం చేయటానికి మాత్రమే కాకుండా సౌందర్యపోషకంగా కూడా ఇది పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక స్పూను వెనిగర్‌ను మూడు స్పూన్ల నీటితో కలిపి రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని వెల్లడిస్తున్నారు.

• యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ను చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించటానికి వాడవచ్చు. దీనిని క్రమం తప్పకుండా ప్రతిరోజు రాస్తే– చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. దీని వల్ల నిగనిగలాడుతుంది.

• కొందరికి చర్మం జిడ్డోడుతూ ఉంటుంది. అలాంటి వారు యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ను రాసి మర్ధనా చేస్తే– రక్తప్రసారం సరిగ్గా అవుతుంది.

• ముఖంపై వచ్చే పొక్కులు. వాటి వల్ల వచ్చే మచ్చలు ఎక్కువ కాలం పోకపోతే– యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ ఒక మంచి మందు. దీనిని క్రమం తప్పకుండా రాస్తే– ఈ పొక్కులు, మచ్చలు తొలగిపోతాయి.

• కొందరు దీనిని సన్‌స్క్రీన్‌ లోషన్‌ మాదిరిగా కూడా ఉపయోగిస్తారు. సన్‌స్క్రీన్‌ లోషన్‌ బదులుగా దీనిని ఉపయోగించుకోవాలనుకొనేవారు– యాపిల్‌ సిడర్‌ వెనిగార్‌లో కొద్దిగా నీళ్లు కలిపి రాసుకోవాలి. దీని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.

Updated Date - 2023-06-07T14:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising