Walking: వాకింగ్ చేసేటప్పుడు ఈ 5 పొరపాట్లు చేయకండి.. చాలా నష్టపోతారు!!
ABN, Publish Date - Dec 17 , 2023 | 02:27 PM
వాకింగ్ చేస్తే బోలెడు లాభాలంటాం. కానీ ఈ పొరపాట్లు చేస్తే మాత్రం.
వాకింగ్ చాలా సులువుగా ఎవరైనా చేయగలిగే వ్యాయామం. దీన్ని కార్డియో వ్యాయామాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీర్ఘకాలం వాకింగ్ చేసేవారిలో అధిక బరువు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ చాలామందికి వాకింగ్ రూల్స్ తెలియవు. నడుస్తున్నాం కదా.. ఆరోగ్యంగా ఉంటాంలే అనే అపోహలో ఉంటారు. కానీ వాకింగ్ చేసే చాలామందికి తెలియని విషయాలున్నాయి. తమకు తెలియకుండానే 5 పొరపాట్లు చేస్తుంటారు. వీటి కారణంగా చాలా నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ వాకింగ్ చేసేటప్పుడు చేయకూడని పొరపాట్లేమిటో తెలుసుకుంటే..
నడిచే స్థలం.. సమయం
వాకింగ్ కు మంచి స్థలం, సమయం ముఖ్యం. పార్క్ లు, ఇంటి బయట తోట, పచ్చని వాతావరణం, సహజ కాంతి ఉండే ప్రదేశాలలో వాకింగ్ చెయ్యాలి. నగరాల్లో నివసించేవారు సూర్యుడు ఉదయించాక వాకింగ్ చేయడం మంచిది. 7గంటల లోపు వాతావరణంలో కాలుష్యం స్థాయిలు ఎక్కువ ఉంటాయట.
ఇది కూడా చదవండి: Bear Grylls: మగవాళ్లు ఏడిస్తే జరిగేదేంటి? బేర్ గ్రిల్స్ బయటపెట్టిన షాకింగ్ నిజాలివీ..!
సౌకర్యం
వాకింగ్ షూస్, దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బరువు లేని షూస్, నడవడానికి సౌకర్యవంతమైన దుస్తులు ఎంపిక చేసుకోవాలి. కాళ్లకు సపోర్ట్ గా, అరికాళ్లు వంగడానికి సౌకర్యవంతంగా ఉన్న షూస్ ఎంచుకోవాలి.
వాకింగ్ ముందు.. తరువాత..
నేరుగా వాకింగ్ కు వెళ్లకూడదు. నడకకు 15-20 నిమిషాల ముందు నీరు త్రాగాలి. నడుస్తూ నీళ్లు తాగకూడదు. దీనివల్ల శరీరంలో నీరు, లవణాల బ్యాలెన్స్ తప్పుతుంది. నడకకు ముందు వార్మప్, నడిచిన తరువాత వార్మౌట్ కావాలి. శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి. దీనివల్ల కండరాల నొప్పులు, ఎముకల సమస్యలు నివారించవచ్చు.
ఇది కూడా చదవండి: జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
ఎలా నడవాలంటే..
సరైన భంగిమలో నడవకపోతే మోకాళ్లు, చీలమండల నొప్పులు సులభంగా వస్తాయి. వెన్ను నిటారుగా, గడ్డంపైకి లేపి స్ట్రైట్ గా నడవాలి. భుజాలు వంచి ఎప్పుడూ నడవకూడదు. ఇలా చేస్తే ఊపిరితిత్తులలో గాలి ప్రవాహం మందగిస్తుంది. ఇది వాకింగ్ చేసేటప్పుడు తొందరగా అలసిపోయేలా చేస్తుంది.
వేగం
వేగంగా వాకింగ్ చేసేటప్పుడు చిన్నచిన్న అంగలు వేస్తూ వేగంగా నడవాలి. అదే మెల్లిగా వాకింగ్ చేసేటప్పుడు పెద్ద అంగలు వేస్తూ నడిచినా ఏమీ కాదు. లేకపోతే మోకాళ్ల మీద ప్రభావం పడి సమస్యలు వస్తాయి.
(గమనిక: ఇది ఫిట్నెస్ నిపుణులు, వైద్యలు పలుచోట్ల పేర్కొన్న కథనాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్య సమస్యలేమైనా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
Updated Date - Dec 17 , 2023 | 02:27 PM