Health benefits: పాదాలతో నడవడంపై నిపుణులు ఏమంటున్నారంటే..!
ABN, First Publish Date - 2023-06-05T13:45:18+05:30
నడవటం, పరిగెత్తటం.. ఏదైనా సరే షూ ఉండాల్సిందే. అయితే షూ లేకుండా పాదాలతో
నడవటం, పరిగెత్తటం.. ఏదైనా సరే షూ ఉండాల్సిందే. అయితే షూ లేకుండా పాదాలతో నడవటం, పరిగెత్తడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
● నేలమీద పాదాలతో నడవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రిఫ్రెష్ అయ్యే భావన కలుగుతుంది. ఇది ప్రకృతి అద్భుత భావన. ఇలా పాదాలతో నడవటాన్ని ‘బేర్ ఫుట్ వాకింగ్’ అంటారు.
● పాదాలకు నరాలు కనెక్ట్ అవుతాయి. దీంతో పాటు పాతికశాతం ఎముకల లింక్ పాదాలతోనే ముడిపడి ఉంటుంది. అందుకే బేర్‌ఫుట్ వాకింగ్ చేయటం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.
● చెప్పుల్లేకుండా నడిస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. తద్వారా సంతోషం కలుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
● అరికాళ్లలో ఉండే నరాలు యాక్టివేట్ కావటం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
● గ్రౌండ్‌లో, గడ్డిమీద.. ఇలా ఎక్కడ బావుంటే అక్కడ పాదాలతో నడవటం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఇరవై నిముషాలు నడవటం అలవాటు చేసుకున్నాక నిడివిని పెంచుకోవాలి.
Updated Date - 2023-06-05T13:45:18+05:30 IST