ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yoga: ఛాతీలో మంట వేధిస్తుందా? అయితే ఇలా చేయండి!

ABN, First Publish Date - 2023-10-10T16:51:18+05:30

ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....

ఏం తిన్నా ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి. అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు ఉన్నాయి. అవేంటంటే....

మార్జారియాసనం

వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణను పెంచి, జీర్ణసంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది. సున్నితమైన మర్దన జరిగి జీర్ణవ్యవస్థ క్రమబద్ధమై, అసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ ఆసనం ఎలా వేయాలంటే.....

  • చేతులు, మోకాళ్ల మీద బల్ల ఆకారంలో నేల మీద కూర్చోవాలి.

  • ఈ భంగిమలో మోకాళ్లు అరడుగు దూరంలో, చేతులు నిటారుగా నేల మీద ఆనించి ఉంచాలి.

  • ఊపిరి పీల్చుతూ, తలను నెమ్మదిగా పైకి లేపి వెనక్కి వాల్చాలి.

  • ఇలా చేస్తూ వీపును పైకి లేపి విల్లు ఆకారంలో వంగాలి.

  • ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా వెన్ను వంచుతూ, ఊపిరి వదులుతూ పూర్వ స్థితికి రావాలి.

అధోముఖశవాసనం

ఆ ఆసనంలో శరీర బరువు చేతులు, కాళ్లపై పడుతుంది. ఈ ఆసనంతో పొత్తికడుపులోకి ప్రాణవాయువు వెళ్లి అసిడిటీ అదుపులోకి వస్తుంది. ఈ ఆసనం వేయడం కూడా సులువే! దీన్ని ఎలా వేయాలంటే....

  • చేతులు, కాళ్ల ఆసరాతో శరీరాన్ని బల్ల ఆకారంలో వంచాలి.

  • ఊపిరి వదులుతూ నడుమును పైకి లేపి, చేతులు, కాళ్లు నిటారుగా ఉంచాలి.

  • చేతులు, భుజాలకు, కాళ్లు, తుంటికి సమాంతరంగా ఉండాలి. కాలి బొటనవేళ్లు ముందుకు ఉండాలి.

  • ఇప్పుడు చేతులు నేల మీద బలంగా తాకిస్తూ, తలను వంచాలి. ఈ భంగిమలో చెవులు చేతులను తాకాలి.

  • ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, మోకాళ్లను వంచి, శరీరాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలి.

బాలాసనం

ఈ ఆసనం శరీరానికి స్వాంతన కలిగించి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది. ఫలితంగా అసిడిటీ తగ్గుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు జీర్ణసంబంధ అవయవాలకు మర్దన జరిగి, బలపడతాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

  • మెకాళ్ల మీద, రెండు పాదాల బొటనవేళ్లు ఒకదానికొకటి తగిలేలా కాళ్లను వెనక్కి వాల్చి కూర్చోవాలి.

  • నడుము పైభాగాన్ని ముందుకు వంచి, పడుకోవాలి.

  • చేతులు రెండూ ముందుకు చాపి, మోకాళ్లకు సమాంతరంగా నేల మీద ఆనించాలి.

  • భుజాలు రెండూ కిందకు వాల్చాలి.

  • ఈ భంగిమలో 30 సెకన్లపాటు ఉండి, నెమ్మదిగా పైకి లేవాలి.

Updated Date - 2023-10-10T16:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising