Yoga: రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే..!
ABN, First Publish Date - 2023-06-10T11:20:29+05:30
నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయటం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే
నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయటం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
యోగాసనాలు వేయటం వల్ల శరీరం స్ర్టెచ్ అయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయటం అలవాటు చేసుకుంటే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండెకు మంచిది.
శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఫేస్‌లో కాంతి కనిపిస్తుంది.
శరీరానికి మంచి ఫిట్‌నె్‌సను ఇస్తుంది యోగా. శరీరం బ్యాలన్స్ అవ్వటం వల్ల కండరాలు మరింతగా గట్టిపడతాయి.
యోగాసనాలు వేయటం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. తలనొప్పులు, వెన్నెముక లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు యోగా అద్భుతమైన ఔషధంలా పని చేస్తుంది. సాఫీగా నిద్ర కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.
డిప్రెషన్ మూడ్ పోతుంది. మెంటల్‌గా స్ర్టాంగ్ కావటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
యోగా చేసేవారి వయసు కూడా కనపడదు. యంగ్ లుక్‌లో ఉంటారు. దీని వల్ల మరింత ఆనందం కలుగుతుంది. జీవనకాలం పెరుగుతుంది.
యోగాసనాలు వేయటం వల్ల ఎముకల్లో గట్టిదనం వస్తుంది. జీవక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళ శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తి కూడా కలుగుతుంది.
నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయటం ఉత్తమం. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి.
Updated Date - 2023-06-10T11:20:29+05:30 IST