ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Office Yoga: ఇలా చేస్తే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు!

ABN, First Publish Date - 2023-06-07T12:06:58+05:30

ఎనిమిది గంటలైనా కుర్చీలో కూర్చుని కంప్యూటర్‌పై పనిచేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఆఫీసులో కూర్చుని చేసే

Yoga
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనిమిది గంటలైనా కుర్చీలో కూర్చుని కంప్యూటర్‌పై పనిచేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఆఫీసులో కూర్చుని చేసే ‘యోగా’ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అలాంటి యోగాసనాలేమిటో ఏమిటో చూద్దాం...

విశ్రాంతి కోసం..

ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పనిచేస్తే ఒక విధమైన అలసట వస్తుంది. ఇది తొలగిపోవటానికి కుర్చీలో కూర్చునే విశ్రాంతి తీసుకొనే ఆసనం ఒకటుంది. కుర్చీలో నడుమును నిటారుగా ఉంచి...అరిచేతులను తొడలపై ఉంచాలి. మూడు నిమిషాలు కళ్లు మూసుకొని దీర్ఘశ్వాసలు తీసుకోవాలి. ఇలా రోజుకు కనీసం రెండు సార్లు చేస్తే అలసట తొలగిపోతుంది.

నడుము నొప్పి పోవాలంటే..

నడుము నెప్పి పోవాలంటే ముందు ఉన్న డెస్క్‌పై చేతులు ఉంచాలి. తల పైకెత్తి నడుమును ముందుకు వంచాలి. పది సెకన్ల తర్వాత నడమును లోపలికి వంచి తలను డెస్క్‌ వైపు వచ్చేలా వంచాలి. ఇలా పది సార్లు చేస్తే నడుము నెప్పికి కొంత ఉపశమనం లభిస్తుంది.

అరచేయి.. మోచేతి నొప్పులు పోవాలంటే

పిడికిలి బిగించి చేతిని ముందుకు చాపాలి. పిడికిలిని గుండ్రంగా ఎడమవైపునకు.. ఆ తర్వాత కుడివైపునకు తిప్పాలి. ఇలా పది సార్లు చేసిన తర్వాత రెండు చేతులను ముందుకు చాపి అరిచేతి భాగం ముందకు వచ్చేలా వేళ్లను లాక్‌ చేయాలి. ఇలా చేతులను ముందుకు.. వెనక్కు కదపాలి. ఇలా పది సార్లు చేయాలి. ఈ రెండు ఎక్సర్‌సైజ్‌ల వల్ల చేతుల నెప్పులు తగ్గుతాయి.

తొడ కండరాల కోసం..

ఎక్కువ సేపు కుర్చీలో కదలకుండా కూర్చుంటే తొడ కండరాలు బిగిసుకుపోతాయి. ఈ ఇబ్బందిని తొలగించటానికి– కుర్చీలో నిటారుగా కూర్చుని.. ఎడమ కాలి మడమను కుడి కాలి తొడపై పెట్టాలి. ఆ తర్వాత కళ్లు మూసుకొని 7 నుంచి 10 సార్లు దీర్ఘశ్వాసను తీసుకోవాలి. ఇలా చేస్తే తొడ కండరాలపై ఒత్తిడి తొలగిపోతుంది.

Updated Date - 2023-06-07T12:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising