ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yoga: ఫ్లెక్సిబిలిటీ పెరగాలంటే?

ABN, First Publish Date - 2023-02-21T14:32:21+05:30

మనం మన కండరాలు, కీళ్లను వాటి పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించం. అలాగే సెడెంటరీ జీవితానికి అలవాటు పడినవాళ్ల

లాభం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం మన కండరాలు, కీళ్లను వాటి పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించం. అలాగే సెడెంటరీ జీవితానికి అలవాటు పడినవాళ్ల కీళ్లు, కండరాలు త్వరగా దెబ్బతిని, ఎంతో త్వరగా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు యోగా ఎంతో బాగా తోడ్పడుతుంది.

యోగాతో శరీరం దృఢంగా మారుతుంది. రోగనిరోధకశక్తి, ఫ్లెక్సిబిలిటీలు కూడా పెరుగుతాయి. కాబట్టి తాడాసనం, వీరభద్రాసనం, వృక్షాసనం, వశిష్ఠాసనం, సేతు బంధాసనం, మత్స్యాసనం, బాలాసనం సాధన చేయాలి.

తాడాసనం: ఈ ఆసనంతో శరీర భంగిమను సరిదిద్దుకోవచ్చు. ఫలితంగా కండరాలన్నీ సాగి, నొప్పులు తగ్గుతాయి. ఈ ఆసనం నాడీ, జీర్ణ, శ్వాస వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.

వీరభద్రాసనం: ఈ ఆసనం వేయడానికి ఏకాగ్రత, సామర్థ్యం అవసరం. ఈ ఆసన సాధనలో శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారడమే కాకుండా శరీర రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. కాళ్లు, కటి, ఊపిరితిత్తులు, ఛాతీ, భుజాలు సాగుతాయి. ఈ ఆసనం క్రమం తప్పక సాధన చేయడం ద్వారా శరీరం దృఢంగా మారుతుంది.

వృక్షాసనం: వెన్నును బలపరిచి, సంతులనాన్ని అందిస్తుంది. ఈ ఆసనంతో నాడీకండర సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పక సాధన చేయడం ద్వారా తొట్రుపడి పడిపోవడం లాంటి ప్రమాదాలు తప్పుతాయి. శరీరం మీద పూర్తి నియంత్రణ సాధించగలుగుతాం.

వశిష్ఠాసనం: కాలి వెనక భాగం, మణికట్లు ఈ ఆసనంతో సాగుతాయి. ప్లాంక్‌ భంగిమలో ఉన్నప్పుడు, శరీరాన్ని వంకర లేకుండా సరళ రేఖలో ఉంచగలగాలి. ఈ ఆసనంతో పొత్తికడుపు, కాళ్లలోని కండరాలు, అంతర్గత అవయవాలు బలం పుంజుకుంటాయి.

సేతు బంధాసనం: ఈ ఆసనంతో ఛాతీ, భుజాలు, వెన్ను, మెడ వెనక భాగం, పిరుదులు విప్పారతాయి. ఈ ఆసనంతో ఒత్తిడి, అలసట, నిద్రలేమి, అధిక రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. మోకాళ్లు, భుజాలకు మర్దన ఫలం దక్కుతుంది.

మత్స్యాసనం: ఈ ఆసనంతో వెన్ను, పొత్తికడుపు దృఢపడతాయి. ఈ ఆసనంతో మెడ వంపు తిరుగుతుంది కాబట్టి థైరాయిడ్‌ గ్రంథి చైతన్యం పొందుతుంది. వెన్ను సాగి, రోగనిరోధకశక్తి కూడా మెరుగవుతుంది. క్రమం తప్పక ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా గుండె పోటు నుంచి రక్షణ పొందవచ్చు.

బాలాసనం: ఇమ్యూనిటీని పెంచే ఆసనమిది. పొత్తికడుపు కండరాలు సాగి, విసర్జక వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. వెన్ను, కటి ప్రదేశాలు సాగి, శరీరం స్వాంతన పొందుతుంది. మణికట్లు, కాళ్లు, మోకాళ్లు, ఛాతీ, ఊపిరితిత్తులు, గుండె, మెడ, పిరుదులకు ఈ ఆసనంతో లాభం చేకూరుతుంది.

Updated Date - 2023-03-20T12:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising