Weight loss: మెనూలో ఇవి చేర్చుకుని చూడండి!
ABN, First Publish Date - 2023-07-06T12:21:20+05:30
కఠినమైన వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. అలా కాకుండా తినకుండా ఉంటే.. ఏమాత్రం బరువు తగ్గరు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఇలాంటి ఆహారాన్ని మీ మెనూలో ఉంచుకోండి.
కఠినమైన వ్యాయామాలు చేసినంత మాత్రాన బరువు తగ్గరు. అలా కాకుండా తినకుండా ఉంటే.. ఏమాత్రం బరువు తగ్గరు. ఇంతకీ బరువు తగ్గాలంటే ఇలాంటి ఆహారాన్ని మీ మెనూలో ఉంచుకోండి.
జీడిపప్పు, బాదం, పిస్తాతో పాటు కర్జూరం లాంటి డ్రైఫ్రూట్స్ కొన్ని తిన్నా కడుపు నిండుతుంది. ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. దీంతో పాటు బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు మీ మెనూలో ఉండాలి.
ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం చేయాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకోవటం వల్ల అందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలం. దీంతో బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటారు.
చేపల్లో అధికంగా ప్రొటీన్లు ఉంటాయి. వీటిలోని హెల్తీ ఫ్యాటీ ఆరోగ్యానికి మంచిదే. జీవక్రియ మెరుగుపడుతుంది.
బీన్స్, ఆలు, దుంపలు తినటం వల్ల బరువు తగ్గుతారు.
నూనెపదార్థాలను తగ్గించాలి. మీట్‌ను వీలైనంతగా తగ్గించాలి.
మితమైన ఆహారంతో సరైన సమయంలో తినటం వల్ల బరువు తగ్గుతారు. ప్రతి రోజూ నడక, రన్నింగ్ చేయటం, వ్యాయామాలు చేయటం తప్పనిసరి.
Updated Date - 2023-07-06T12:21:20+05:30 IST