Peru: గోల్డ్ మైన్ అగ్ని ప్రమాదం... 27 మంది మృతి
ABN, First Publish Date - 2023-05-08T08:45:06+05:30
దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది కార్మికులు...
యానాక్విహువా(పెరూ): దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది కార్మికులు మరణించారు.(Gold Mine Fire) పెరూ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాల్లో ఒకటిగా గోల్డ్ మైన్ అగ్ని ప్రమాదం నిలిచింది.(Tragedy In Peru) మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో బంగారు గని ప్రాంతం దద్దరిల్లింది.
మృతుల్లో ఫెడెరికో ఉండటంతో అతని భార్య మార్సెలీనా గని వద్దకు వచ్చి ‘‘ఎక్కడున్నావ్ డార్లింగ్ అంటూ విలపించారు.షార్ట్యుసర్క్యూట్(short circuit) వల్ల గనిలో పేలుడు జరిగి అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి తాము షాక్ కు గురయ్యామని మరో బాధితుడి సోదరుడు ఫ్రాన్సిస్కో చెప్పారు. అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ అధికారులు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి : Cyclone Mocha:అండమాన్,నికోబార్ దీవులకు భారీ వర్షాలు...ఐఎండీ హెచ్చరిక
బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గనిలో చాలా మంది మైనర్లు ఊపిరాడక,కాలిన గాయాలతో మరణించారని యానాక్విహువా మేయర్ జేమ్స్ కాస్క్వినో ఆండినా చెప్పారు.మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు.గనిలో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు ఎలాంటి నివేదికలు లేవు.లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తి దేశమైన పెరూలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాల్లో ఈ సంఘటన ఒకటి.
Updated Date - 2023-05-08T08:45:06+05:30 IST