ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Xi Jingping: జీ20 సదస్సుకి జిన్‌పింగ్ డుమ్మా వెనుక రహస్యమేంటి? ఈ 5 కారణాల వల్లే రావట్లేదా?

ABN, First Publish Date - 2023-09-05T16:39:28+05:30

ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా బీజింగ్ స్పష్టం...

ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా బీజింగ్ స్పష్టం చేసింది. షీ జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరు అవుతారని చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ అధికారికంగా తెలిపారు. అయితే.. జిన్‌పింగ్ ఎందుకు రావడం లేదన్న కారణం మాత్రం తెలపలేదు.

అఫ్‌కోర్స్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమ్మిట్‌కి రావట్లేదు. అయితే.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోతున్నారు. పైగా.. పుతిన్ స్వయంగా ఫోన్ చేసి, ప్రధాని మోదీకి తన గైర్హాజరు విషయం గురించి తెలిపారు. తన స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తారని చెప్పారు. కానీ.. జిన్‌పింగ్ మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే జీ20 సదస్సుకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. జిన్‌పింగ్ గౌర్హాజరు వెనుక ఈ 5 కారణాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఆ కారణాలు ఏంటంటే..

* రీసెంట్‌గా ‘చైనా స్టాండర్డ్ మ్యాప్ 2023’ పేరుతో ఆ దేశం విడుదల చేసిన మ్యాప్ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు. ఆ మ్యాప్‌లో భారత భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్‌ని తమ భూభాగాలుగా ఆ మ్యాప్‌లో చూపించింది. దీనిపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఫలితంగా.. చైనా, భారత్ మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

* సరిహద్దు విషయంలో చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా.. 2020లో లడఖ్‌లో గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘటనలో 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటి నుంచి.. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి సరిహద్దుల వద్ద ఇరుదేశాలు భారీ స్థాయిలో బలగాల్ని, విమానాల్ని మోహరించాయి.

* చైనా ప్రధాన ప్రత్యర్థి యునైటెడ్ స్టేట్స్(అమెరికా), భారత్ మధ్య వాణిజ్య & వ్యూహాత్మక సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ విషయం చైనాకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. బహుశా ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. దీనికితోడు.. భారత్, చైనా రెండూ తమతమ దేశాల జర్నలిస్టుల్ని బహిష్కరించాయి.

* బ్రిక్స్ సమ్మిట్‌కి వెళ్లి, జీ20కి డుమ్మా కొట్టడం బట్టి చూస్తే.. ‘తూర్పు దేశాలు బలపడుతున్నాయి, పశ్చిమ దేశాలు బలహీనపడుతున్నాయి’ అని జిన్‌పిన్ పరోక్షంగా చాటి చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోందని ఆస్ట్రేలియాలకు చెందిన రాజకీయ శాస్త్రవేత్త వెన్-టి సంగ్ తెలిపారు. అలాగే.. పుతిన్ రావట్లేదు కాబట్టి, ఆయనకు సంఘీభావంగా జిన్‌పింగ్ రావట్లేదని అర్థం చేసుకోవచ్చన్నారు.

* బహుశా దేశీయ సమస్యల కారణంగా షీ జిన్‌పింగ్ విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చని సింగపూర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఆల్ర్పెడ్ వూ అభిప్రాయపడ్డారు. జిన్‌పింగ్ సొంతంగా ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకుంటున్నాడని.. జాతీయ భద్రత దృష్ట్యా అతను చైనాలోనే ఉండి, విదేశీ నాయకుల్ని తనని సందర్శించేలా చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-05T16:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising