Trump: ట్రంప్‌నకు మరో షాక్... అధ్యక్ష ఎన్నికలకి అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే నిర్ణయం
ABN, Publish Date - Dec 29 , 2023 | 07:53 AM
క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను వేటాడుతోంది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.
న్యూయార్క్: క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను వేటాడుతోంది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొలరాడోకి చెందిన న్యాయస్థానం ఆయనపై నిషేధాన్ని విధించింది. తాజాగా మైనే ఎన్నికల అధికారి నిర్ణయంతో ట్రంప్ పోటీకి ప్రతిబంధకంగా మారింది.
కొలరాడో కోర్టు తీర్పు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు కొలరాడో కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు షాక్ కలిగించింది. కొలరాడో(Colarado) రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటించింది.
దీంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ(Republican Party) నుంచి తన రాష్ట్రంలో పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. కాగా తీర్పుపై జనవరి 4వరకు స్టే విధించారు. అనర్హత పడకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాజీ అధ్యక్షుడి లీగల్ టీం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
అభ్యర్థిత్వంపై ప్రభావం..
కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది. మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ మరో సారి బరిలో దిగనున్న విషయం తెలిసిందే. కోర్టు తాజా తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు. అయితే కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుంది. క్యాపిటల్ హిల్ దాడితో ట్రంప్ దేశ విద్రోహానికి పాల్పడినట్లు పలువురు కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) విజయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్(Capital Hill)పై దాడికి పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. ట్రంప్ మద్దతుదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 29 , 2023 | 07:53 AM