ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

America Model Case: అమెరికాలో మోడల్ దారుణ హత్య.. శ్రద్ధా వాకర్ తరహాలో హత్య చేసి, ఫ్రిడ్జ్‌లో మృతదేహం పెట్టి..

ABN, First Publish Date - 2023-10-29T18:08:09+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుందా? గతేడాదిలో ఢిల్లీలో బాయ్‌ఫ్రెండ్ ఆఫ్తాబ్ పూనావాలా ఆమెను దారుణంగా చంపేసి, ముక్కలు ముక్కలుగా నరికేసి, ఆ శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి,..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుందా? గతేడాదిలో ఢిల్లీలో బాయ్‌ఫ్రెండ్ ఆఫ్తాబ్ పూనావాలా ఆమెను దారుణంగా చంపేసి, ముక్కలు ముక్కలుగా నరికేసి, ఆ శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి, అప్పుడప్పుడు వాటిని బయట పడేసేవాడు. ఈ తరహాలోనే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోనూ ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్రిజ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు ఆమె మద్యపానం సేవించిందని, ఆమె రెండు నెలల గర్భిణీ అని కూడా పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.


ఆ మోడల్ పేరు మలీసా మూనీ. ఆమె సోదరి జోర్డిన్ పాలిన్ కూడా ఒక మోడల్‌గా కొనసాగుతోంది. తన సోదరి తల్లి కావాలని కలలు కనేదని ఓ మీడియాకు ఆమె వెల్లడించింది. తీరా చూస్తే.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమె రెండు నెలల గర్భిణీ అని వెల్లడైంది. రిపోర్ట్ ప్రకారం.. మరణానికి ముందు మలీసా భౌతిక దాడికి గురైనట్టు వెలుగులోకి వచ్చింది. చేతులు కట్టి, నోరు మూసేసి, రక్తంతో తడిసిన స్థితిలో మలీసా మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై ఉన్న గాయాల్ని బట్టి చూస్తే.. ఆమెను చాలా దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఆమెను చంపేసిన తర్వాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, అక్కడి నుంచి హంతకులు పరారైనట్టు స్పష్టమవుతోంది. ఆమె శరీరంలో బెంజాయిలెక్గోనైన్ (కొకైన్ మెటాబోలైట్), కోకెథిలిన్, ఇథనాల్ మిశ్రమం కనిపించాయని కూడా రిపోర్ట్‌లో తేలింది.

మలీసాను గొంతుకోసి హత్య చేసినట్లు ఆధారాలు కూడా లభించాయి. సోదరి మృతదేహం చూసి జోర్డిన్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన సోదరి ఎంత దారుణ స్థితిని ఎదుర్కుందో ఊహిస్తేనే ఒళ్లు గగుర్పొడుతోందని, తనకు చాలా భయంగా ఉందని ఆమె తెలిపింది. అదే సమయంలో.. మలీసా మొబైల్ ఫోన్, మ్యాక్‌బుక్‌తో అనుసంధానించబడిన ఐక్లౌడ్‌లో అలర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. దీనర్థం.. ఆమె ఫోన్‌ని మరొకరు ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఆమెను హత్య చేసింది ఎవరు? ఆమె వస్తువుల్ని ఎవరు వినియోగిస్తున్నారు? ఆమెను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు స్థానికంగా సంచలనం రేపుతోంది.

Updated Date - 2023-10-29T18:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising