ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Phone Bill: ఆ ఒక్క చిన్న తప్పు చేసిన పాపానికి.. రూ.1.65 కోట్లు ఢమాల్.. అసలేం జరిగిందంటే?

ABN, First Publish Date - 2023-08-13T22:47:34+05:30

కొన్నిసార్లు మనం తెలియకుండానే ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అప్పుడు వాటి ప్రభావం పెద్దగా కనిపించదు కానీ.. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది..

కొన్నిసార్లు మనం తెలియకుండానే ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అప్పుడు వాటి ప్రభావం పెద్దగా కనిపించదు కానీ.. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి స్థితినే ఒక మహిళ ఎదుర్కుంది. ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా.. ఏకంగా రూ.1.65 కోట్ల ఫోన్ బిల్లు వచ్చింది. అదెలాగో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్లాల్సిందే..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సెలీనా అనే మహిళ తన ఇద్దరు సోదరులతో కలిసి ఉంటోంది. ఆ ఇద్దరు సోదరులు వికలాంగులే. వీళ్లు టెక్స్ట్, డేటా కమ్యూనికేషన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ఇద్దరితో సెలీనా తన ఫోన్ బిల్‌ను పంచుకుంటూ వస్తోంది. వీళ్లు ముగ్గురు కలిసి ఎంత వాడినా.. ఫోన్ బిల్లు గరిష్టంగా 130 పౌండ్స్ (రూ.13,715) మాత్రమే వచ్చింది. కానీ.. రీసెంట్‌గా మాత్రం ఆమెకు 2,01,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.1.65 కోట్లు) వచ్చింది. అది చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. అసలు ఇంత బిల్లు ఎలా వచ్చిందని ఒక్కసారిగా షాక్‌కి గురైంది.దీంతో.. వెంటనే సెలీనా తన సర్వీస్ ప్రొవైడర్ ‘T-Mobile’కి కాల్ చేసింది. తనకు అంత బిల్లు ఎలా వేస్తారని నిలదీసింది.


సెలీనా ఫిర్యాదు మేరకు ఒకసారి చెక్ చేసిన సర్వీస్ ప్రొవైడర్.. మీకు వచ్చిన బిల్లు సరైనదేనని, ఎలాంటి తప్పులు దొర్లలేదని సమాధానం ఇచ్చింది. మరి.. తనకు 2,00,000 డాలర్లకు మించి బిల్లు వచ్చినప్పుడు, ఎందుకు తనకు తెలియజేయలేదని సెలీనా ఫైర్ అయ్యింది. అందుకు టీ-మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ మాత్రం సమాధానం ఇవ్వలేదు. అప్పుడు సెలీనాకి ఏం చేయాలో పాలుపోక.. నేరుగా మీడియాని ఆశ్రయించింది. ఆ దెబ్బకు ఈ వ్యవహారం కాస్త వైరల్ అవ్వడంతో.. T-Mobile సంస్థ కిందకు దిగొచ్చింది. బిల్లును 2,500 డాలర్లకు (రూ. 2.05 లక్షలు) తగ్గించి, ఆ మొత్తం చెల్లించేందుకు గాను ఆరు నెలల గడువు ఇచ్చింది.

ఇంతకీ.. సెలీనాకు ఇంత భారీగా ఫోన్ బిల్లు ఎలా వచ్చిందనేగా మీ సందేహం? సెలీనా సోదరులిద్దరూ అమెరికా బార్డర్ దాటి కెనడాకు వెళ్లారు. అక్కడ వారం రోజుల పాటు బస చేశారు. దీంతో.. వాళ్లు అంతర్జాతీయ కాల్స్ మాట్లాడాల్సి వచ్చింది. అలాగే.. 2వేలకు పైగా టెక్స్ట్, వీడియోలను డౌన్‌లోడ్ చేశారు. కేవలం డేటా వినియోగానికే 15,000 పౌండ్లు (రూ. 15.83 లక్షలు) ఖర్చు అయ్యింది. ఇలా మొత్తం ఖర్చులు కలుపుకొని ఆమెకు ఫోన్ బిల్లు రూ.1.65 కోట్లు వచ్చింది. నిజానికి.. విదేశీ వినియోగానికి సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులు చదవకపోవడం వల్లే, సెలీనా నెత్తిన ఇంత భారీ బిల్లు పడింది.

Updated Date - 2023-08-13T22:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising