ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. రెచ్చిపోయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, వందలాది గృహాలకు నిప్పు

ABN, First Publish Date - 2023-03-04T20:08:43+05:30

బంగ్లాదేశ్‌ లో పలు ఇస్లామిస్ట్ సంస్థల మిలిటెంట్ లీడర్లు, సభ్యులు శనివారంనాడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పలు ఇస్లామిస్ట్ సంస్థల మిలిటెంట్ లీడర్లు, సభ్యులు (Islamist organisations members) శనివారంనాడు రెచ్చిపోయారు. వందలాది గృహాలకు నిప్పుపెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో అమ్మదీయ ముస్లిం వర్గం తలపెట్టిన ఓ ఈవెంట్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు పెద్దఎత్తున హింసకు దారితీశాయి. ఢాకా-పంచగఢ్‌ హైవేను ఆందోళనకారులు దిగ్బంధం చేస్తూ, అహ్మదీయ వర్గం వారిపై, పోలీసులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు పోలీసు సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు.

దీనికి ముందు, అహ్మదీయ ముస్లింలు మూడురోజుల మతపరమైన 'జలసా సాలానా' ఉత్సవాలకు పిలిపునివ్వడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అహ్మదీయ ముస్లింల కార్యక్రమానికి వ్యతిరేకంగా వివిధ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్ లీడర్లు, సభ్యులు నిరసనలకు దిగడంతో వారిని జామామసీదు వద్ద, పంచగఢ్ జిల్లా చౌరంగి కూడలి సమీపంలోని వైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మిలిటెంట్లు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీస్ బాక్స్‌కు నిప్పుపెట్టారు. ఇస్లా్మిస్టుల దాడిలో పలు పోలీసు వాహనాలు, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ వాహనాలు దెబ్బతిన్నాయి. అహ్మదీయ ముస్లిం వర్గాలకు చెందిన 100 ఇళ్లు, దుకాణాలకు మిలిటెంట్లు నిప్పుపెట్టారు. పలు రోడ్లపై టైర్లు తగులపెట్టారు. ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరడంతో జిల్లాలోని దుకాణాలు మూతపడ్డాయి. కాగా, పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను పెద్దఎత్తున రంగంలోకి దింపినట్టు జిల్లా ఎస్‌పీ ఎస్పీ సిరాజుల్ హుడా తెలిపారు.

Updated Date - 2023-03-04T20:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising